ప్చ్.. రీమేక్ లు అంటేనే భయపడుతున్నాడు !

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హట్ కొట్టి, అదే ఉత్సాహంతో ఈ సంక్రాంతికి ‘రెడ్’ అనే సినిమా తీసుకొచ్చాడు. కాకపోతే ‘రెడ్’ కాస్త కమర్షియల్ గా హిట్ ను అందుకోలేక, బాక్సాఫీస్ వద్ద రెడ్ లైట్ లోకి వెళ్ళిపోయింది. అన్నట్టు ఈ రెడ్ అనేది రీమేక్ సినిమా. నిజానికి రామ్ కి మొదటి నుండి రీమేక్ లు అసలు కలిసి రావడం లేదు. దాంతో, ఇక పై స్ట్రయిట్ స్టోరీస్ ను మాత్రమే సినిమాలుగా […]

Written By: admin, Updated On : March 4, 2021 4:33 pm
Follow us on


ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హట్ కొట్టి, అదే ఉత్సాహంతో ఈ సంక్రాంతికి ‘రెడ్’ అనే సినిమా తీసుకొచ్చాడు. కాకపోతే ‘రెడ్’ కాస్త కమర్షియల్ గా హిట్ ను అందుకోలేక, బాక్సాఫీస్ వద్ద రెడ్ లైట్ లోకి వెళ్ళిపోయింది. అన్నట్టు ఈ రెడ్ అనేది రీమేక్ సినిమా. నిజానికి రామ్ కి మొదటి నుండి రీమేక్ లు అసలు కలిసి రావడం లేదు. దాంతో, ఇక పై స్ట్రయిట్ స్టోరీస్ ను మాత్రమే సినిమాలుగా చెయ్యాలని రామ్ బలంగా డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.

Also Read: జీహెచ్ఎంసీ మేయ‌ర్ పై రాంగోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. తాగేసి కుక్క‌పై ప్రేమా..? నేను కూడా కుక్కగా పుడతా!

రెడ్ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ అనే సినిమాకి రీమేక్. పైగా తెలుగులో పకడ్బందీ మార్పులు చేసి.. తెలుగు ప్రేక్షకుల కోసం చాల అంశాలు జోడించినా, అది పెద్ద ప్లాప్ అయి కూర్చుంది. అందుకే, రామ్ ఇక పై రీమేకులకు దూరంగా ఉండాలనుకుంటున్నాడు. ఇక రామ్ ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో కొత్త సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పూర్తిగా స్ట్రయిట్ స్టోరీనే.

Also Read: హోమ్లీ బ్యూటీకి ఫుల్ డిమాండ్.. కొత్తగా రెండు యాడ్స్ !

ఇది విడుదల అయ్యాక ఇక తెలుగు కథలే చేస్తాడట. అందుకే తనతో టచ్ లో ఉండే రైటర్స్ కి, డైరెక్టర్స్ కి కొత్త కథలను రెడీ చేయండి అంటూ మెసేజ్ లు పాస్ చేశాడట. మరి రామ్ కోసం వాళ్ళు ఎలాంటి కథలు రాస్తారో చూడాలి. రామ్ తన కెరీర్‌ ఆరంభంలోనే మంచి కథలను ఎంచుకుని కొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మధ్యలో కథలు ఎంపికలో కొన్ని పొరపాట్లు చేసి.. వరుస పరాజయాలను ఎదుర్కొంటూ డీలా పడ్డాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ఆ సమయంలోనే రామ్ కి ‘నేను శైలజా’ అనే సూపర్ డూపర్ హిట్ సినిమా పడింది. ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ హిట్ కొట్టాడు. మళ్ళీ అలాంటి సినిమాలు పడితేనే రామ్ కెరీర్ ట్రాక్ ఎక్కి ఫుల్ జోష్‌ లో ఉంటుంది.