https://oktelugu.com/

Hero Rajasekhar: అప్పు పుట్టక కుమిలిపోతున్న స్టార్ హీరో.. మరోవైపు కేసు పెడతాను అంటున్న నిర్మాత

Hero Rajasekhar: టాలీవుడ్ లో రాజశేఖర్ కి ప్రస్తుతం డిమాండ్ లేదు. కానీ చకచకా సినిమాలు చేద్దామని ఆశ పడుతున్నాడు. ఎంతైనా హీరో కదా. కొంతమంది నిర్మాతలు వచ్చి సినిమా మొదలు పెడుతున్నారు. కానీ అవి మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికితోడు ఆ మధ్య వచ్చిన ఓ సక్సెస్ తో రాజశేఖర్ తన రెమ్యూనరేషన్ కూడా పెంచాడు. అయితే అది నామమాత్రమే అనుకోండి, కానీ, ఆ నామమాత్రం ఇవ్వడానికి కూడా సదరు నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు. దీంతో […]

Written By:
  • Shiva
  • , Updated On : August 24, 2022 / 02:01 PM IST
    Follow us on

    Hero Rajasekhar: టాలీవుడ్ లో రాజశేఖర్ కి ప్రస్తుతం డిమాండ్ లేదు. కానీ చకచకా సినిమాలు చేద్దామని ఆశ పడుతున్నాడు. ఎంతైనా హీరో కదా. కొంతమంది నిర్మాతలు వచ్చి సినిమా మొదలు పెడుతున్నారు. కానీ అవి మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికితోడు ఆ మధ్య వచ్చిన ఓ సక్సెస్ తో రాజశేఖర్ తన రెమ్యూనరేషన్ కూడా పెంచాడు. అయితే అది నామమాత్రమే అనుకోండి, కానీ, ఆ నామమాత్రం ఇవ్వడానికి కూడా సదరు నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదు.

    Hero Rajasekhar

    దీంతో జీవితా రాజశేఖర్ కొత్త కాన్సెప్ట్ ను పట్టుకొచ్చింది. అదే లాభాల్లో వాటా. ఈ వాటా వ్యవహారంలో ఇప్పటికే ఓ నిర్మాతతో రాజశేఖర్ ఫ్యామిలీకి గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో కొత్త నిర్మాతతో కూడా ఇలాంటి గొడవే మొదలు అయ్యింది. ఇప్పుడా నిర్మాత కూడా రాజశేఖర్ ఫ్యామిలీ పై కేసు వేయడానికి రెడీ అవుతున్నాడు. పైగా రాజశేఖర్ కొత్త సినిమా కూడా డైలమాలో పడింది. నిర్మాత సీరియస్ అవ్వడంతో

    Also Read: Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’ ఆగిపోయినట్టే? నిర్మాతను నిండా ముంచింది ఆ దర్శకుడేనా?

    ఆఖరి నిమిషంలో ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఓ కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు రాజశేఖర్. అంతా ఓకే అనుకున్న టైమ్ లో నిర్మాత ఇలా రివర్స్ అవుతాడని రాజశేఖర్ ఉహించలేదు. ఈ రివర్స్ కి అసలు రీజన్ జీవితా అని తెలుస్తోంది. నిర్మాతకి ప్రతి విషయంలో సలహాలు సూచనలు ఇస్తూ జోక్యం చేసుకుంటుందట. పైగా సినిమాని ఎవరికీ అమ్మాలి లాంటి విషయాన్ని కూడా జీవితగారే ఫైనల్ చేస్తున్నారట.

    Hero Rajasekhar

    అందుకే.. సదరు నిర్మాత రాజశేఖర్ ఫ్యామిలీ పై కోపంగా ఉన్నారు. తనకు ఫైనాన్షియర్లు డబ్బులు ఇవ్వడం లేదని, అందుకే ఈ సినిమా పూర్తి చేయలేనని ఆ నిర్మాత చెప్పేశాడు. మొత్తానికి నిర్మాత హ్యాండ్సప్ అనడంతో రాజశేఖర్ ఇప్పుడు ఈ సినిమాను తన భుజాలపై వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా వేసుకోవాలి అంటే.. ఆ నిర్మాతకి సెటిల్ చేయాలి. చేస్తేనే ఆ నిర్మాత పర్మిషన్ ఇస్తా అంటున్నాడు.

    మిగిలిన 60శాతం షూటింగ్ పూర్తిచేసి, సినిమాను సాఫీగా విడుదల చేస్తే గానీ, రాజశేఖర్ కి డబ్బులు రావు. అందుకే, ప్రస్తుతం రాజశేఖర్ తన సినిమాకు పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నాడు. కానీ ఎవ్వరూ ముందుకు రావడం లేదు. తనకు తెలిసిన సౌండ్ పార్టీలకు ఫోన్లు చేసి అడుగుతున్నా.. ఎవరూ ఒప్పుకోవడం లేదు. మొత్తానికి రాజశేఖర్ వ్యవహారం ప్రస్తుతం ఏమి బాగాలేదు. ఈ విషయంలో రాజశేఖర్ చాలా బాధలో ఉన్నాడట.

    Also Read:Payal Rajput: 50 లక్షల కోసం పాయల్ రాజ్ పుత్ సంచలన నిర్ణయం.. ఆ సీన్స్ కి సై.. సంతోషంలో నిర్మాతలు

     

     

    Tags