Priyadarshi and Alekhya Chitti : సోషల్ మీడియా లో గత నాలుగైదు రోజులుగా అలేఖ్య చిట్టి(Alekhya Chitti) పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒకపక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో చాలా వేడిగా ఉన్నాయి, మరోపక్క యూత్ మొత్తం IPL మ్యాచులు చేస్తూ బిజీ గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఏ మూలకు వెళ్లినా ఇవే కనిపిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా అలేఖ్య చిట్టి అనే అమ్మాయి సడన్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇన్ స్టాగ్రామ్ ని ఉపయోగించే వాళ్లకు ఈమె ఎవరో తెలియకుండా ఉండదు. రకరకాల పికిల్స్ ని ఆన్లైన్ ద్వారా అమ్ముతూ బాగా ఫేమస్ అయ్యింది. అయితే రీసెంట్ గా ఈమె కస్టమర్ ని బూతులు తిడుతూ మాట్లాడిన ఒక ఆడియో రికార్డు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ పికిల్ ధరలు ఈ రేంజ్ లో ఉన్నాయేంటి అని కస్టమర్ అడిగిన పాపానికి అతనిపై నోరు పారేసుకుంది.
Also Read : ‘గేమ్ చేంజర్’ విషయం లో నాకు చాలా అన్యాయం జరిగింది అంటూ నటుడు ప్రియదర్శి ఎమోషనల్ కామెంట్స్!
పికిల్స్ నే కొనలేని నువ్వు, రేపు నీ భార్యని ఎలా చూసుకుంటావు, ఆమె బంగారం నెక్లెస్ అడిగితే ఎక్కడి నుండి తీసుకొస్తావు. నువ్వు జీవితం లో స్థిరపడలేవు అంటూ కాస్త ఘాటైన భాషలో రెస్పాన్స్ ఇచ్చింది. దీనిపై ఎన్నో మీమ్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్ గానే కోర్ట్(Court Movie) మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని మంచి ఊపు మీదున్న హీరో/ కమెడియన్ ప్రియదర్శి(Priyadarshi), ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా హీరోయిన్ తో కలిసి అలేఖ్య చిట్టి వైరల్ ఆడియో కి స్పూఫ్ చేస్తూ ఒక వీడియో ని విడుదల చేశారు. దీనికి ఆడియన్స్ నుండి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
ముందుగా హీరోయిన్ ఫోన్ లో డ్రెస్ ని చూస్తూ ‘వావ్..డ్రెస్ ఎంతో బాగుంది కదా’ అని అంటుంది. అప్పుడు ప్రియదర్శి కూడా ‘వావ్..చాలా బాగుంది’ అని అంటాడు. ఆ తర్వాత ఆయన రేట్ ని చూసి ‘ఆమ్మో..ఈ డ్రెస్ ధర 14 వేల రూపాయిల..చాలా కాస్ట్ కదా’ అని అంటాడు. ఇక ఆ తర్వాత హీరోయిన్ మాట్లాడుతూ ‘నువ్వు కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. రేపు పెళ్ళామో, లేదా గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి డ్రెస్ కొనిపెట్టమని అడిగినప్పుడు చాలా ఖరీదు నా వల్ల కాదు అన్నావు అనుకో, ఆమె నిన్ను వదిలేసి వెళ్ళిపోతాది. దయచేసి పెళ్లి, ప్రేమ జోలికి వెళ్ళకు. డ్రెస్ నే కొనిపెట్టలేక ఉన్నావు, రేపు బంగారం కొనివ్వమంటే ఏమి చేస్తావ్ రా నువ్వు?,’ అని అంటుంది. ఆ వీడియో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. మరోపక్క అలేఖ్య చిట్టి సోషల్ మీడియా ద్వారా తానూ కస్టమర్స్ ని తిట్టినందుకు క్షమాపణలు చెప్పింది.
Also Read : మిస్టర్.. కామెంట్ చేసే ముందు జాగ్రత్త.. ప్రియదర్శికి ఇచ్చి పడేసిన నభా నటేష్
#AlekhyaChitti Pickels ni ila Kuda Vaaduthunnara #SarangapaniJathakam pic.twitter.com/drzaThDdTU
— Movies4u (@Movies4uOfficl) April 5, 2025