https://oktelugu.com/

Nithin: మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న హీరో నితిన్

Nithin: వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటిగా నిలిచినా వీళ్లిద్దరి నుండి సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ప్రేక్షుకులు ఎప్పటి నుండో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు..ఎందుకంటే గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు మరియు ఖలేజా సినిమాల బాక్స్ ఆఫీస్ ఫలితాలు పక్కన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 16, 2022 / 09:09 AM IST
    Follow us on

    Nithin: వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ కాంబినేషన్స్ లో ఒకటిగా నిలిచినా వీళ్లిద్దరి నుండి సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ప్రేక్షుకులు ఎప్పటి నుండో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు..ఎందుకంటే గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు మరియు ఖలేజా సినిమాల బాక్స్ ఆఫీస్ ఫలితాలు పక్కన పెడితే టాలీవుడ్ లోనే క్లాసిక్ చిత్రాల లిస్ట్ లో ఒకటిగా చేరిపోయింది..టీవీ లలో ఈ రెండు సినిమాలు ఎప్పుడొచ్చినా TRP రేటింగ్స్ అదిరిపోతాయి..ఈ కాంబినేషన్ కి ఉన్న పవర్ అలాంటిది..అందుకే షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే మహేష్ – త్రివిక్రమ్ సినిమాపై రోజు రోజుకి ట్రేడ్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి..త్రివిక్రమ్ కూడా ఇంతకు ముందు ఎప్పుడు తియ్యని జానర్ లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడట..అయితే కథ రీత్యా ఈ సినిమాకి మరో హీరో కూడా అవసరం.

    Nithin, mahesh

    ఆ సెకండ్ హీరో పాత్ర కోసం తొలుత న్యాచురల్ స్టార్ నాని ని అడిగారట..కానీ నాని ఇందులో నటించడానికి ఒప్పుకోలేదు..ఆ తర్వాత శర్వానంద్ డేట్స్ కోసం త్రివిక్రమ్ ట్రై చేస్తునట్టు కూడా వార్తలు వచ్చాయి..కానీ అది కూడా జరగలేదు..ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే ఆ పాత్ర చెయ్యడానికి యంగ్ హీరో నితిన్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది..ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ నితిన్ ని కలిసి సినిమాలో ఆయన పాత్ర ఎంత కీలకమో చెప్పాడట..ఆ పాత్ర బాగా నచ్చడం తో నితిన్ కూడా ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అ..ఆ చిత్రం ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..అప్పట్లోనే ఈ సినిమా 50 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.

    Also Read: Devi Sri Prasad- Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన దేవిశ్రీ ప్రసాద్

    Nithin

    ఆ తర్వాత నితిన్ హీరో గా నటించిన చల్ మోహన్ రంగ సినిమాకి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ , స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించాడు..ఆ విధంగా వీళ్లిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది..త్రివిక్రమ్ తో ఉన్న ఆ రిలేషన్ వల్లే నితిన్ అంత తేలికగా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండగా విలన్ గా మలయాళం స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.

    Also Read:Ashu Reddy: వైరల్ అవుతున్న అషురెడ్డి ముద్దుల వీడియో.. ఛీ అంటున్న నెటిజన్లు

    Tags