Priyamani Divorce: సామాన్య మధ్య తరగతి కుటుంబాలలో పెళ్లి అన్నా లేదా విడాకులు తీసుకోవాలన్న చాలా పెద్ద విషయం..కానీ సెలెబ్రెటీలకు ఇప్పుడు అది ఒక ట్రెండ్ లాగ మారిపోయింది..ఒకరిని చూసి ఒకరు ఆదర్శంగా తీసుకొని విడాకులు తీసుకుంటున్నారా అనే విషయం తెలీదు కానీ..ఈమధ్య కాలం లో విడాకులు తీసుకోవడం అనేది చాలా మాములు విషయం అయిపోయింది మన సెలెబ్రెటీలకు..ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిపోయారు ప్రముఖ హీరోయిన్ ప్రియమణి గారు..ఈమె ముస్తఫా అనే అతనిని ప్రేమించి పెళ్లాడింది..ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆమె ప్రేమించింది మాములు మనిషిని కాదు..అప్పటికే పెళ్ళైన వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది..ప్రియమణి మీద ముస్తఫా గారి మొదటి భార్య అప్పట్లో పోలీస్ కేసు పెట్టింది కూడా పెట్టింది..కానీ ప్రియమణి వాటిని ఏ మాత్రం లెక్క చెయ్యకుండా ముస్తఫా తో కాపురం చేస్తూ వచ్చింది..ఇక్కడ వరుకు అంతా బాగానే ఉంది కానీ ఇటీవల కాలం లో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు బాగా పెరిగిపోయిందట..అతి త్వరలోనే వీళ్లిద్దరు విడాకులు తీసుకోవాలని భావిస్తున్నట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తాయి.

అసలు విషయానికి వస్తే ప్రియమణి గారికి ఇప్పట్లో పిల్లల్ని కనే ఉద్దేశ్యం లేదట..కెరీర్ లో తానూ అనుకున్న స్థాయిలో స్థిరపడే వరుకు పిల్లలల్ని కనకూడదని ఆమె అభిప్రాయం..కానీ ముస్తఫా అది నచ్చట్లేదు..ఆయనకీ పిల్లలు కావలి..ఈ విషయం లోనే వీళ్లిద్దరి మధ్య సఖ్యత కుదరండం లేదు..తరుచు గొడవలు అవుతూనే ఉన్నాయి..ఆ కారణం చేత ఈ ఇద్దరు విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది..ప్రియమణి గారు ప్రస్తుతం వరుస సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో కెరీర్ లో ఫుల్ బిజీ గా ఉంటున్నారు.
Also Read: Nithin: మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్న హీరో నితిన్

ఇంకా కొన్నేళ్లు తానూ అనుకున్న స్థాయికి చేరుకున్న తర్వాత అన్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అని ఆమె అభిప్రాయం..మరి సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ ఉండే ప్రియమణి ఇప్పుడు వస్తున్నా ఈ వార్తలపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read:Devi Sri Prasad- Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన దేవిశ్రీ ప్రసాద్
[…] Also Read: Priyamani Divorce: భర్త తో విడాకులు తీసుకోబోతున్… […]