Hero Nithin: టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరోలలో ఒకరు నితిన్..జయం సినిమా తో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈ క్రేజీ స్టార్ కి కెరీర్ ప్రారంభం లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ తగిలినప్పటికీ..మధ్యలో ఏకంగా పది డిజాస్టర్ ఫ్లాప్స్ తగిలాయి..మార్కెట్ మొత్తం పూర్తిగా పోయిన తర్వాత ఎవ్వరు ఊహించని విధంగా ఇష్క్ సినిమా తో హిట్ కొట్టి భారీ కంబ్యాక్ ఇచ్చాడు..ఇక అక్కడి నుండి హిట్టు మీద హిట్టు కొడుతూ మళ్ళీ క్రేజీ హీరోలలో ఒకరిగా చేరిపోయాడు నితిన్..అయితే ఇటీవల కాలం లో భీష్మ సినిమా తర్వాత నితిన్ కి సరైన హిట్ లేదు..ఆ సినిమా తర్వాత చెక్ సినిమా ఫ్లాప్ కాగా , రంగదే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా నిలిచింది..ఇక ఆ తర్వాత హిందీ లో సూపర్ హిట్ గా నిలిచినా అందాదున్ అనే సినిమాని తెలుగు లో ‘మాస్ట్రో’ పేరుతో రీమేక్ చేసి నేరుగా OTT లో విడుదల చేసాడు..ఇప్పుడు ఆయన మరో నెల రోజుల్లో మన ముందుకి మాచెర్ల నియోజకవర్గం అనే సినిమా ద్వారా రాబోతున్నాడు.
నూతన దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది..హీరోయిన్ క్రితి శెట్టి ఇందులో నితిన్ కి జోడిగా నటించగా..కథెరిన్ థెరిసా మరో హీరోయిన్ గా నటించింది..ఇక ప్రముఖ హీరోయిన్ అంజలి ఈ సినిమాలో ‘రా రా రెడ్డి’ అనే మాస్ ఐటెం సాంగ్ చేసింది..ఇటీవలే ఈ పాట ని విడుదల చెయ్యగా అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది..ఇవన్నీ పక్కన పెడితే నితిన్ ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ఒక సరికొత్త ట్రెండ్ ని సృష్టించబోతున్నాడు.
అదేమిటంటే బుల్లితెర లో ప్రసారమయ్యే టాప్ సీరియల్స్ లో నితిన్ గెస్ట్ గా కనిపించబోతున్నాడు..టీవీ సీరియల్స్ అంటే ప్రతి కుటుంబం కచ్చితంగా చూస్తుంది..ఈ సీరియల్స్ ద్వారా బాగా రీచ్ అవ్వొచ్చు కూడా..ఇదే ప్లాన్ ని ఇక్కడ నితిన్ వాడబోతున్నాడట..టీవీ సీరియల్స్ లో అతిధిగా నటించడం ద్వారా తన సినిమా గురించి ఫామిలీ ఆడియన్స్ అందరికి తెలిసేలా ఉంటుందని..ప్రొమోషన్స్ లో దీనిని కొట్టే ప్లాన్ మరొకటి లేదని నితిన్ అనుకుంటున్నాడట..చూడాలిమరి నితిన్ ప్లాన్ ఎంత వరుకు సక్సెస్ అవుతుంది అనేది..భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
Also Read: IMDB Releases Top 10 Indian Films: ‘ఐఎమ్డీబీ – 2022’: ఇప్పటివరకు టాప్ 10 భారతీయ చిత్రాల లిస్ట్ ఇదే
Recommended Videos