NTR- Chiranjeevi: తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో నెంబర్ 1 హీరోలుగా అశేష ప్రజాభిమానం పొందిన స్టార్స్ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామా రావు గారు ఒకరైతే..మెగాస్టార్ చిరంజీవి మరొక్కరు..దశాబ్దాలకు పైగా ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీ లో నెంబర్ 1 స్థానం లో కొనసాగారు..రామారావు గారు సినిమాలు వదిలి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి శకం ఇండీస్ట్రీ లో మొదలైంది..అప్పటి వరుకు కేవలం ఒకే మూసలో సాగుతున్న తెలుగు సినిమా గతిని మార్చిన స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి..డాన్స్ లోను ఫైట్స్ లోను చిరంజీవి ఆరోజుల్లో ఒక ప్రభంజనం..ముఖ్యంగా నటనలో కూడా తనకి తానె సాటి ఎవ్వరు లేరు పోటీ అనే విధంగా చిరంజీవి కెరీర్ సాగింది..అయితే చిరంజీవి కెరీర్ ప్రారంభం లో చాలా ఒడిదుడుకులనే ఎదురుకున్నాడు..చిన్న చిన్న క్యారెక్టర్స్ ద్వారా నెమ్మదిగా హీరో రోల్స్ సంపాదించుకున్న చిరంజీవి..అప్పట్లో ఎన్టీఆర్ గారితో కలిసి కూడా ఒక సినిమా లో నటించాడు..ఆ సినిమా పేరే ‘ఎదురులేని మనిషి’..ఇందులో ఎన్టీఆర్ తో సమానమైన పాత్రని చిరంజీవి చేసాడు..అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ లో అప్పట్లో ఒక సినిమా ప్రారంభం అయ్యి మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయం చాలా మందికి తెలియదు.
NTR- Chiranjeevi
ఇక ఆశలు విషయానికి వస్తే అప్పట్లో ఎన్టీఆర్ మరియు రాఘవేంద్ర రావు గారి కాంబినేషన్ లో కొదమ సింహం అనే సినిమా వచ్చింది..అప్పట్లో ఈ సినిమా మాములు హిట్ కాదు..అప్పటి వరుకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టింది..ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి కొడుకుగా మోహన్ బాబు నటించాడు.
Also Read: IMDB Releases Top 10 Indian Films: ‘ఐఎమ్డీబీ – 2022’: ఇప్పటివరకు టాప్ 10 భారతీయ చిత్రాల లిస్ట్ ఇదే
NTR- Chiranjeevi
అయితే తొలుత ఈ పాత్ర కోసం చిరంజీవి గారిని తీసుకున్నారట..5 రోజుల పాటు ఆయనతో షూటింగ్ కూడా జరిపాడట..అయితే ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఎన్టీఆర్ కి సవాలు విసురుతూ పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పేలా ఉంటుంది..అయితే అంత పెద్ద స్టార్ ని ఎదిరించి డైలాగ్స్ చెప్పడానికి చిరంజీవి చాలా ఇబ్బంది పడ్డాడట..దాని వల్ల చాలా టేకులు అయ్యేవి అట కానీ ఔట్పుట్ మాత్రం రాఘవేంద్ర రావు గారు ఊహించినట్టు రావడం లేదట..ఎన్టీఆర్ ఏమో ఈ సినిమా కోసం కేవలం 30 రోజులు డేట్స్ మాత్రమే ఇచ్చాడు..ఇక్కడేమో సమయం ఎక్కువ అయిపోతుంది..దీనితో ఈ పాత్రకి చిరంజీవి సరికాదు అని ఆయనని తప్పించి మోహన్ బాబు తో చేయించారు..గతం లో మోహన్ బాబు ఎన్టీఆర్ కి ఎదురునిలబడే పాత్రలు చేసాడు కాబట్టి ఆయనకీ ఈ పాత్రలో చెయ్యడానికి చాలా సులువు అయ్యింది..అలా ఈ క్రేజీ కాంబినేషన్ మిస్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
Also Read:Mokshagna: ‘పవన్ కళ్యాణ్’ డైరెక్టర్ తో మోక్షజ్ఞ సినిమా.. బాలయ్య గ్రీన్ సిగ్నల్