https://oktelugu.com/

Robinhood Review : రాబిన్ హుడ్ ఫుల్ మూవీ రివ్యూ…

Robinhood Review కమర్షియల్ సినిమాలను ఎలా తీయాలో వెంకీ కుడుములకు చాలా బాగా తెలుసు.. గత రెండు సినిమాలతో ఆయన తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఈ సినిమాలో కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా సినిమా నడిపించే

Written By: , Updated On : March 28, 2025 / 07:41 AM IST
Robin Hood

Robin Hood

Follow us on

Robinhood Review : యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నితిన్ తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిన రాబిన్ హుడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే నితిన్ సాధారణ వ్యక్తిగా తన లైఫ్ ని లీడ్ చేస్తూనే తెలియని ఒక సీక్రెట్ మిషన్ ను రన్ చేస్తూ ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. తను రాబిన్ హుడ్ గా మారాల్సి వచ్చింది అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు వెంకీ కుడుముల నితిన్ తో కలిసి ఇంతకుముందు భీష్మ అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా అయితే తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ ను చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికైతే ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్ టైనింగ్ గా సాగినప్పటికి సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ విజువల్ ఫీస్టు గా తెరకెక్కించడంతో ప్రతి ప్రేక్షకుడిని చాలా వరకు ఆకట్టుకున్నాయి.

కమర్షియల్ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఉండాలో ప్రతి ఎలిమెంట్ ఇందులో ఉంది. ఇక ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో నితిన్ చెప్పే కొన్ని ఎమోషనల్ డైలాగులు ప్రతి ప్రేక్షకుడికి విపరీతంగా నచ్చుతాయి. అంతేకాకుండా ఆయన క్యారెక్టర్ మలిచిన విధానం కూడా చాలా బాగుంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది. కేతిక శర్మ చేసిన ఐటెం సాంగ్ కి కూడా థియేటర్ లో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది.

ఇక వెంకీ కుడుముల ఎక్కడ డివియోషన్స్ లేకుండా తను చెప్పాలనుకున్న పాయింట్ చాలా స్ట్రైట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అందువల్లే ఒక జెన్యూన్ అటెంప్ట్ గా ఈ సినిమాని నిలిపే ప్రయత్నమైతే చేశాడు. కమర్షియల్ సినిమాలను ఎలా తీయాలో వెంకీ కుడుములకు చాలా బాగా తెలుసు.. గత రెండు సినిమాలతో ఆయన తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి ఈ సినిమాలో కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా సినిమా నడిపించే ప్రయత్నం అయితే చేశాడు…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నితిన్ ఈ సినిమాలో చాలా అద్భుతమైన నటనను చూపించాడనే చెప్పాలి. ఇంతకుముందు ఆయన చేయనటువంటి ఒక కామిక్ రోల్ లో కనిపించడమే కాకుండా అక్కడక్కడ సీరియస్ సీన్స్ లో కూడా చాలా బాగా నటించి మెప్పించాడనే చెప్పాలి. ఆయన చేసిన ప్రతి సీన్ కి థియేటర్లో అదిరిపోయే రెస్పాన్స్ అయితే వస్తుంది… శ్రీలీలా సైతం తన పాత్రకి కొంతవరకు ఇంపార్టెన్స్ ఉండడంతో తను కూడా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించింది… శాన్ టామ్ చాకో కూడా తన పాత్రకు చాలా వరకు న్యాయం చేశారనే చెప్పాలి. ఇక రాజేంద్రప్రసాద్ అక్కడక్కడ కామెడీ టచ్ చేస్తూనే కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసాడు వెన్నెల కిషోర్ ఆద్యంతం నవ్వించే ప్రయత్నం చేశాడు…

టెక్నికల్ అంశాలు

ఈ సినిమా టెక్నీకల్ అంశాల విషయానికి వస్తే మనం అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. సాంగ్స్ అద్భుతంగా ఉండటమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా ఆయన కొంతవరకు వైవిధ్యాన్ని ప్రదర్శించాడు. ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ వల్లే కొన్ని ఎమోషనల్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ కూడా ప్రేక్షకులను మెప్పించగలిగాయి… సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి చాలా బాగా సెట్ అయింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు చాలావరకు హెల్ప్ అయ్యాయి…

ప్లస్ పాయింట్స్

నితిన్
కామెడీ సీన్స్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ

రేటింగ్

ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5

Robinhood Official Trailer | Nithiin | Sreeleela | Venky Kudumula | GV Prakash | Mythri Movie Makers