Nikhil Siddhartha: హీరో నిఖిల్ ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పాడు. ఆయన త్వరలో తండ్రి కాబోతున్నాడు. భార్యకు ఘనంగా సీమంతం వేడుక నిర్వహించాడు. పట్టుచీరలో నిండు గర్భవతిగా ఉన్న భార్య పక్కన నిల్చుని ఫోజిచ్చాడు. నిఖిల్ 2020లో కోవిడ్ ఆంక్షల మధ్య వివాహం చేసుకున్నాడు. లాక్ డౌన్ ముగిశాక ఘనంగా చేసుకోవాలని ఆయన అనుకున్నారు. అయితే లాక్ డౌన్ నెలల తరబడి సాగిన నేపథ్యంలో మే 14న అత్యంత సన్నిహితుల మధ్య నిఖిల్ వివాహం జరిగింది.
నిఖిల్ భార్య పేరు పల్లవి. ఈమె వృత్తిరీత్యా డాక్టర్. పెళ్ళైన మూడేళ్లకు ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. పల్లవి గర్భం దాల్చారు. పల్లవికి నిఖిల్ ఘనంగా సీమంతం వేడుక నిర్వహించాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దాంతో నిఖిల్ కి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిఖిల్ త్వరలో తండ్రి కాబోతున్నాడన్న మాట.
ఆ మధ్య నిఖిల్-పల్లవి మధ్య మనస్పర్థలు వచ్చాయనే కథనాలు వెలువడ్డాయి. ఈ జంట విడాకులకు సిద్ధం అవుతున్నారంటూ పుకార్లు వినిపించాయి. ఈ ఊహాగానాలను నిఖిల్ కొట్టిపారేశాడు. ఇక కార్తికేయ 2తో నిఖిల్ పాన్ ఇండియా హిట్ కొట్టిన విషయం తెలిసిందే. డివోషనల్ అంశాలతో సోషియో ఫాంటసీ సబ్జెక్టు గా కార్తికేయ 2 తెరకెక్కింది. చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
అయితే కార్తికేయ 2 తర్వాత నిఖిల్ కి మరో హిట్ పడలేదు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 18 పేజెస్ కమర్షియల్ గా ఆడలేదు. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన స్పై డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీలో నిఖిల్ రా ఏజెంట్ గా నటించాడు. ప్రస్తుతం స్వయంభు టైటిల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నిఖిల్ చాలా కష్టపడుతున్నాడు. యుద్ధ విద్యల్లో కూడా శిక్షణ తీసుకున్నాడు.