https://oktelugu.com/

Hero Nikhil: సీపీ సజ్జనార్ ఆఫీసులో హీరో నిఖిల్

సరికొత్త విభిన్నమైన కథలను ఎంచుకొని టాలీవుడ్ లో విజయతీరాలకు చేరుతున్న యంగ్ హీరో తెరమీదనే కాదు.. తెరవెనుక కూడా హీరోనే. కరోనా లాక్ డౌన్ లో హీరో నిఖిల్ చేసిన సాయాలు అందరికీ గుర్తే. సోనూ సూద్ లాగానే హైదరాబాద్ లో ట్విట్టర్ లో కోరిన వారందరికీ ఈ సాయాలను హీరో నిఖిల్ అందించాడు. ఈ హీరోసేవలను గుర్తించిన చాలా మంది ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా హీరో నిఖిల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 14, 2021 / 10:35 AM IST
    Follow us on

    సరికొత్త విభిన్నమైన కథలను ఎంచుకొని టాలీవుడ్ లో విజయతీరాలకు చేరుతున్న యంగ్ హీరో తెరమీదనే కాదు.. తెరవెనుక కూడా హీరోనే. కరోనా లాక్ డౌన్ లో హీరో నిఖిల్ చేసిన సాయాలు అందరికీ గుర్తే. సోనూ సూద్ లాగానే హైదరాబాద్ లో ట్విట్టర్ లో కోరిన వారందరికీ ఈ సాయాలను హీరో నిఖిల్ అందించాడు. ఈ హీరోసేవలను గుర్తించిన చాలా మంది ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు.

    తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా హీరో నిఖిల్ ను ప్రత్యేకంగా సన్మానించారు. కరోనా సెకండ్వేవ్ లో నిఖిల్ చేసిన సేవలకు గాను సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు. కరోనా సెకండ్ వేవ్ లో ఎంతమంది పేదవాళ్లు సరైన వైద్య సదుపాయాలు లేక నానా కష్టాలు పడ్డారు. వారందరికీ నిఖిల్ వీలైనంత సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

    హీరో నిఖిల్ సెకండ్ వేవ్ లో అడిగిన వెంటనే అందరికీ మందులు, ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశాడు. నిఖిల్ లోని మానవతా దృక్పథాన్ని మెచ్చుకుంటూ ఎంతో మందిని సాయం చేసిన నిఖిల్ స్ఫూర్తిగా నిలిచారని.. సెకండ్ వేవ్ లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్లకు నిఖిల్ డబ్బు సాయం కూడా చేసినట్లు సీపీ సజ్జనార్ కొనియాడారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడి మంచి మనసునున్న హీరోగా నిలిచారని అన్నారు.

    సీపీ సజ్జనార్ తోపాటు మరికొంత మంది ఉన్నతాధికారులు కూడా నిఖిల్ ను ప్రత్యేకంగా సన్మానించారు. నిఖిల్ సేవలకు తగిన గుర్తింపు లభించినట్టైంది. ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్ లో 19 పేజెస్ అనే సినిమాను హీరో నిఖిల్ చేస్తున్నాడు.