ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 347 ఉద్యోగ ఖాళీల ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగా వేతనం లభిస్తుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు సెప్టెంబర్ 3వ తేదీలోపు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లు https://www.unionbankofindia.co.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.
పోస్టులను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉండగా అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్ ఉద్యోగాలకు 30 – 40 ఏళ్లు, మేనేజర్ ఉద్యోగాలకు 25 – 35 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 20 – 30 ఏళ్లు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా మిగిలిన అభ్యర్థులు 850 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.