Nani story Judgment: సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో మెగా స్టార్ చిరంజీవి తర్వాత హీరో నాని(Hero Nani)ని చెప్పవచ్చు. చిన్న చిన్న పాత్రలతో మొదలైన నాని ప్రస్థానం ఇప్పుడు టాలీవుడ్ లో ఒక మంచి నటుడిగా ఎదిగే వరకు సాగింది. ‘నేచురల్ స్టార్’ను చేసింది. టాలీవుడ్ హీరోలందరిలోకి ‘కథ’ విని ఇది హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అని సరిగ్గా అంచనావేయగల హీరో ‘నాని’ అని ఇండస్ట్రీలో పేరుంది. గతంలో నాని సినిమా ఫెయిల్ అయినా కూడా కథ సెలక్షన్ పై విమర్శలు రాకపోగా.. ఇతర కారణాల వల్లే సినిమా ఫెయిల్ అయ్యిందని చర్చ నడిచింది.
అయితే తాజాగా హీరో నాని కథల ఎంపిక(story selection), జడ్జిమెంట్ పూర్తిగా గాడితప్పిందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సరైన కథను ఎంచుకోవడమే ఇప్పుడు హీరోల ముందు ఉన్న ప్రధానమైన అంశం. ఇదే అత్యంత కత్తిమీద సాములాంటిది. హీరో కెరీర్ విజయవంతం కావాలన్నా.. అథ: పాతాళానికి పోవాలన్నా అతడు ఎన్నుకునే కథలపైనే ఆధారపడి ఉంటుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరో మంచు విష్ణు కూడా తాను చేసిన పొరపాటు కథలు, దర్శకుల ఎంపికే అని.. వాటి వల్లే తన కెరీర్ నాశనమైందని చెప్పుకొచ్చారు.
కెరీర్ మొదట్లో వరుస విజయాలు అందుకున్న నాని కథను ఎన్నుకునే విధానంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిశాయి. ఒక సామాన్య ప్రేక్షకుడి కోణంలో తాను కథ వింటున్నప్పుడే విజువైలైజ్ చేసుకొని చూస్తానని.. అప్పుడే హిట్అవుతుందా? లేదా అని తెలుస్తుందని నాని ఒకనొక సమయంలో చిరంజీవి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. హీరోయిజాన్ని పక్కనపెట్టి ఆలోచిస్తేనే విజయం సాధ్యమన్నారు.
అలాంటి హీరో నాని గత మూడేళ్లుగా గాడితప్పాడని అంటున్నారు. 2017లో వచ్చిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమా హిట్ అయిన తర్వాత నాని సినిమాలన్నీ వరుసబెట్టి ఫెయిల్ అవుతున్నాయి. 2018లో విడుదలైన ‘కృష్ణార్జున యుద్ధం’, దేవదాస్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 2019లో వచ్చిన జెర్సీ, గ్యాంగ్ లీడర్ లు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. జెర్సీకి అవార్డు వచ్చినా డబ్బులు రాలేదు.
ఇక 2020లో వచ్చిన ‘వి’ సినిమా నానికి సరైన హిట్ ను అందించలేదు. ఇక తాజాగా విడుదలైన ‘టక్ జగదీష్’ సైతం బోరింగ్ డ్రామా అన్న టాక్ తెచ్చుకుంది.
ఇలా వరుసగా స్టోరీల జడ్జిమెంట్ విషయంలో హీరో నాని ఇండస్ట్రీ పెద్దల ప్రశంసలు అందుకొని ఇప్పుడు ఎందుకో కానీ సరిగ్గా జడ్జ్ చేయడం లేదన్న టాక్ నడుస్తోంది. జడ్జిమెంట్ విషయంలో నాని ఫెయిల్ అయిపోతున్నాడని అంటున్నారు. అందుకే ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెబుతున్నారు.