https://oktelugu.com/

Shyam Singaroy Movie: భారీ ధరకు నాని “శ్యామ్ సింగరాయ్” మూవీ ఓటిటి హక్కులు…

Shyam Singaroy Movie: నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న సినిమా “శ్యామ్ సింగరాయ్”. ఈ సినిమా ను డిసెంబ‌ర్ 24 తెలుగు తో పాటు త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ,  మ‌ల‌యాళ భాష‌ల‌లో పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ మూవీని  […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 23, 2021 / 09:24 AM IST
    Follow us on

    Shyam Singaroy Movie: నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న సినిమా “శ్యామ్ సింగరాయ్”. ఈ సినిమా ను డిసెంబ‌ర్ 24 తెలుగు తో పాటు త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ,  మ‌ల‌యాళ భాష‌ల‌లో పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ మూవీని  నిర్మిస్తున్నారు. నాని కేరీయ‌ర్ లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో తీసిన మూవీ ఇదే కావ‌డం విశేషం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా జ‌రుపు కుంటుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

    ఈ సినిమా ఓటీటీ హక్కులను  ప్ర‌ముఖ ఓటిటీ సంస్థ భారీ మొత్తానికి ద‌క్కించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. దాదాపు రూ. 8 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సంస్థ శ్యామ్ సింగరాయ్ హక్కులను దక్కించుకుందంట. అలాగే ఈ సినిమా హింది రైట్స్ కోసం ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ సంస్థ భారీ మొత్తాన్ని వెచ్చించింది. రూ. 10 కోట్ల కు బీ 4 యూ  అనే ప్ర‌ముఖ హింది ఛాన‌ల్ చేజిక్కుంచుకుందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమా లోని రెండో పాట “ఏదో ఏదో” ను నవంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు , టీజర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.