https://oktelugu.com/

Punith Rajkumar: త్వరలోనే పునీత్​ రాజ్​కుమార్ బయోపిక్.. డైరెక్టర్​ ఎవ్వరటే?​

Punith Rajkumar: కన్నడ పవర్​ స్టార్ పునీత్​ రాజ్​కుమార్​ ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ పరిశ్రమతో పాటు, అభిమానులకు తీరని లోటుగా మారింది. ఇకపై ఆయన లేరనే విషయాన్ని కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, ఈ క్రమంలోనే జనాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయేలా.. పునీత్​ బయోపిక్​ను తెరకెక్కించాలని పలువురు భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్​ వచ్చింది. తాజాగా, పునీత్​కు భారీ హిట్లు తెచ్చి పెట్టిన దర్శకుడు సంతోష్​ను ఉద్దేశిస్తూ.. పునీత్​ అభిమాని ట్విట్టర్​ వేదికగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 23, 2021 / 09:42 AM IST
    Follow us on

    Punith Rajkumar: కన్నడ పవర్​ స్టార్ పునీత్​ రాజ్​కుమార్​ ఇటీవలే గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో సినీ పరిశ్రమతో పాటు, అభిమానులకు తీరని లోటుగా మారింది. ఇకపై ఆయన లేరనే విషయాన్ని కన్నడిగులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, ఈ క్రమంలోనే జనాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయేలా.. పునీత్​ బయోపిక్​ను తెరకెక్కించాలని పలువురు భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్​ వచ్చింది. తాజాగా, పునీత్​కు భారీ హిట్లు తెచ్చి పెట్టిన దర్శకుడు సంతోష్​ను ఉద్దేశిస్తూ.. పునీత్​ అభిమాని ట్విట్టర్​ వేదికగా తన మనసులో మాట చేప్పారు.

    ఈ క్రమంలోనే ట్విట్టర్​లో ఆయనను టాక్​ చేస్తూ.. సర్​.. అప్పు బయోపిక్ తీయండి ప్లీస్​. ఆయన్ను దగ్గరనుంచి చూసిన వ్యక్తి మీరు. ఆయన గురించి మీరు తప్ప ఇంకెవరూ గొప్పగా తీయలేదు.. ఆయన ప్రేమ, విలువలు మీకు బాగా తెలుసు.. దయచేసి అప్పు బయోపికై ఓ కన్నేయండి సర్​. అంటూ కోరాడు. అయితే, దీనిపై స్పందించిన సంతోష్​.. కచ్చితంగా ఆయన అభిమానుల కోరికను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానంటూ బదులిచ్చారు.

    https://twitter.com/SanthoshAnand15/status/1462263110417272834?s=20

    ప్రస్తుతం ఈ ట్వీట్​ నెట్టింట వైరల్​గా మారింది. కాగా, సంతోష్​ దర్శకత్వంలో పునీత్​ ‘రాజా కుమార’, ‘యువరత్న’ సినిమాల్లో నటించారు.  పునీత్​ కెరీర్​లోనే రాజకూమార బిగ్గెస్ట్ హిట్​గా నిలిచింది. మరోవైపు యువరత్న సినిమాతోనే పునీత్​ తెలుగు ప్రేక్షకులకు ఇంకా దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే సంతోష్​ కానీ పునీత్​ బయోపిక్ తీస్తే.. అభిమానులకు మర్చిపోలేని బహుమతిగా మిగిలిపోతుందని అందరూ భావిస్తున్నారు.