Homeఎంటర్టైన్మెంట్Nani: ప్రభాస్ పేరు వాడుకోకపోతే వాడికి బ్రతుకే లేదంటూ ప్రముఖ నటుడిపై హీరో నాని షాకింగ్...

Nani: ప్రభాస్ పేరు వాడుకోకపోతే వాడికి బ్రతుకే లేదంటూ ప్రముఖ నటుడిపై హీరో నాని షాకింగ్ కామెంట్స్!

Nani: మొదటి నుండి మన తెలుగు హీరోలు అంటే బాలీవుడ్ నటీనటులకు చిన్న చూపు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ మనకంటే మార్కెట్ పరంగా పెద్దది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు మాత్రం బాలీవుడ్ కంటే మనం పది రెట్లు ఎక్కువ క్వాలిటీ తో సినిమాలు చేస్తున్నాం. హాలీవుడ్ సినిమాలతో పోటీ పడే రేంజ్ కి వెళ్లిపోయాం. మార్కెట్ పరంగా కూడా బాలీవుడ్ మన ముందు ప్రస్తుతం తుచ్ఛమే. కేవలం ఒక్క ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రమే వాళ్లకు మనకంటే ఎక్కువ పట్టు ఉంది. ఇది అక్కడి నటీనటులకు, దర్శకులకు మింగుడు పడడం లేదు. భయంకరమైన అసూయతో రగిలిపోతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను చాలా తేలికగా కొల్లగొట్టిన ‘కల్కి’ చిత్రం తర్వాత బాలీవుడ్ నటీనటులకు కడుపుమంట ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి ఉదాహరణగా అర్షద్ వార్సీ ని తీసుకోవచ్చు.

Also Read: ‘ఇంద్ర’ కి ఇద్దరు డైరెక్టర్లు పనిచేసారు..ఆ రెండో డైరెక్టర్ ఇండస్ట్రీ లోనే పెద్ద స్టార్ హీరో..ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు!

ఈయన బాలీవుడ్ లో కేవలం ఒక సీనియర్ నటుడు మాత్రమే, ఈయనకి ప్రభాస్ ని చూసి అసూయ పడేంత స్టార్ స్టేటస్ అసలు లేదు. గట్టిగా మాట్లాడితే ఇతనికి ప్రస్తుతం సరైన అవకాశాలు కూడా రావడం లేదు. మీడియా కి అర్షద్ అనే నటుడు ఇండస్ట్రీ లో ఉన్నాడు అనే విషయం కూడా గుర్తు లేదు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా ప్రభాస్ మీద నోరుపారేసుకొని మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చేసాడు. ‘కల్కి’ చిత్రం లో డైరెక్టర్ ప్రభాస్ ని ఒక జోకర్ లాగ చూపించాడని, కేవలం అమితాబ్ బచ్చన్ వల్లనే ఆ సినిమా ఆడింది అంటూ ఎలా పడితే అలా మాట్లాడేసాడు. దీనిపై న్యాచురల్ స్టార్ నాని నేడు స్పందించాడు.

ఈ నెల 29 ఆయన హీరో గా నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో, మూవీ టీం ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో, విలేఖరులు అర్షద్ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ పై మీ స్పందన ఏమిటి అని అడగగా దానికి నాని సమాధానం చెప్తూ ‘ఒకరి ఎదుగుదల ని చూసి కడుపు మంటతో ఉండేవారు చాలామంది ఉంటారు. ఆ అర్షద్ అనే వ్యక్తి ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడు ప్రభాస్ లాంటి స్టార్ మీద కామెంట్ చెయ్యబట్టే ఆయన ఎవరో అందరికీ తెలిసింది. ఇదంతా పబ్లిసిటీ కోసమే’ అంటూ నాని తనదైన శైలిలో స్పందించాడు.ఈ ఈవెంట్ లో పాల్గొన్న దిల్ రాజు కూడా ఇదే విధంగా స్పందించి ప్రభాస్ పేరు వాడుకోకపోతే అతన్ని ఎవరు పట్టించుకుంటారు అంటూ కామెంట్స్ చేసాడు. తెలుగు సినిమా స్థాయి ప్రస్తుతం బాలీవుడ్ ని దాటేసిందని, ఎవరు ఎన్ని కామెంట్స్ చేసిన మన స్థాయి పెరుగుతూ వెళ్తుందే కానీ, ఇసుమంత కూడా తగ్గదు అంటూ ఈ సందర్భంగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ ని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

Also Read: సెప్టెంబర్ 2న ‘ఓజీ’ ఫ్యాన్స్ కి పండగే..క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిర్మాత డీవీవీ దానయ్య!

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version