Hero Nani: వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన తర్వాత, నాని(Natural Star Nani) రీసెంట్ గానే నిర్మాతగా ‘కోర్ట్'(Court Movie) చిత్రం ద్వారా భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. అలా నిర్మాతగా కుంభస్థలం బద్దలు కొట్టిన నాని, మరోసారి ఆయన నిర్మాతగా మారి, హీరో గా చేసిన చిత్రం ‘హిట్ 3′(Hit : The Third Case). ఈ చిత్రానికి ముందు వచ్చిన ‘హిట్ 1’, ‘హిట్ 2’ చిత్రాలు కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. ఈ రెండు సినిమాలకు నాని నిర్మాతగా భారీ లాభాలను అందుకున్నాడు. ఇప్పుడు ఆయనే ఫ్రాంచైజ్ లోకి అడుగుపెట్టడం తో ఈ సినిమాపై ప్రారంభం నుండే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక నేడు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ ని చూసిన తర్వాత నాని అభిమానులకు మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. నాని గతంలో కూడా మాస్ సినిమాలు చేశాడు కానీ ఈ రేంజ్ లో యాక్షన్ సినిమాలు మాత్రం ఇప్పటి వరకు చేయలేదు.
Also Read: మొదట్లో డైరెక్టర్ వశిష్ఠ ను మోసం చేసిన ఇద్దరు స్టార్ హీరోలు…
టీజర్ సమయంలోనే ఫ్యాన్స్ భయపడ్డారు. ఎందుకంటే ఆ రేంజ్ హింసాత్మక సన్నివేశాలను ఇప్పటి వరకు మన తెలుగు ఆడియన్స్ చూడలేదు. మలయాళం లో విడుదలైన మార్కో చిత్రం గత ఏడాది విడుదలై నేషనల్ వైడ్ గా ఎలా సెన్సేషనల్ టాపిక్ గా నిల్చిందో, మే1 న విడుదల అవ్వబోయే ‘హిట్ 3’ చిత్రానికి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఒక ఇన్వెస్టిగేషన్ జానర్ సినిమాలో ఈ రేంజ్ హింస ఉండడం ఏమిటి?, ఇది అసలు యాక్షన్ సినిమానా?, లేకుంటే క్రైమ్ థ్రిల్లరా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని వైజాగ్ లోని ఒక థియేటర్ లో గ్రాండ్ గా చేశారు. నాని అభిమానులు ఈ ఈవెంట్ కి భారీగా పాల్గొని హంగామా చేశారు.
ఈ ఈవెంట్ లో నాని అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా యాంకర్ మాట్లాడుతూ ‘టీజర్ తో భయపెట్టబోతున్నారని అందరికీ అర్థం అయ్యేలా చేశారు..కానీ ట్రైలర్ ని ఇంకా భయపెట్టేసారు.. మా లాంటి చిన్నపిల్లలా పరిస్థితి ఏమిటి సార్..తట్టుకోగలరా ఇలాంటివి చూసి’ అని అడగగా, దానికి నాని సమాధానం చెప్తూ ‘మీ లాంటోళ్ళు ఈ సినిమాకు రాకూడదు’ అని ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఎందుకంటే ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు A సర్టిఫికేట్ ని జారీ చేసింది. అంటే 18 సంవత్సరాల వయస్సు లోపు ఉన్న పిల్లలు ఈ సినిమా చూసేందుకు అనుమతి లేదు అన్నమాట. సింగల్ స్క్రీన్స్ లో ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు కానీ, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో మాత్రం ఈ రూల్స్ ని తూచాతప్పకుండా అనుసరిస్తుంటారు. మే1 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా, నాని జైత్ర యాత్రని కొనసాగించేలా చేస్తుందా?, స్పీడ్ బ్రేకర్ గా నిలుస్తుందా అనేది చూడాలి.
