YS Jagan Mohan Reddy : చంద్రబాబు( Chandrababu) సర్కారులో కీలక అధికారిగా పనిచేశారు ఏబి వెంకటేశ్వరరావు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే వైసిపి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. రెండుసార్లు ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే ఆయన కీలక దశలో ఉండగా.. సర్వీసుకు సంబంధించి బ్రేక్ పడింది. డిజిపి స్థాయి హోదా పోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మోక్షం కలిగింది. గౌరవప్రదంగా పదవీ విరమణ పొందారు. అయితే తనకు రాజకీయంగా నష్టం చేకూర్చిన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఈరోజు సంకేతాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని ఆత్మరక్షణలో నెట్టేందుకు సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : తల్లికి వందనం’ పై బిగ్ అప్డేట్.. వారికి కోత తప్పదా?
* నామినేటెడ్ పదవి దక్కిన
వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావుకు( ab Venkateswara Rao ) కీలక నామినేటెడ్ పదవి దక్కింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే అది ఏబీ వెంకటేశ్వరరావు స్థాయికి తగదన్న కామెంట్స్ వినిపించాయి. ఆ నామినేటెడ్ పదవి కూడా స్వీకరించలేదు వెంకటేశ్వరరావు. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెప్పడం.. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటానని ముందుగానే హెచ్చరించడం మాత్రం మలుపు తిరిగినట్లు అయ్యింది. దీనిపై రకరకాల చర్చ ప్రారంభం అయ్యింది. కచ్చితంగా ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనకు గురి చేసే అంశమే. ఒక మాజీ ఐపీఎస్ అధికారి కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకునేందుకు రాజకీయాల్లోకి వస్తానని చెప్పడం విశేషం.
* రాష్ట్రంలో రెడ్ బుక్ సంస్కృతి
కాగా ఏబీ వెంకటేశ్వరరావు తీరుపై అప్పుడే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ స్పందించింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత నేతగా గుర్తింపు పొందిన గడికోట శ్రీకాంత్ రెడ్డి ఈరోజు స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం కాకుండా ఇప్పుడు.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ పై జరిగిన దాడి ఒక ముందస్తు పథకం ప్రకారం జరిగిందని.. దీనివల్ల టిడిపి కుట్ర మరోసారి బహిర్గతమైందన్నారు. ఈ కుట్ర వెనుక అసలైన పాత్రధారులు బయటపడ్డారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా కోడి కత్తి శ్రీను ఇంటికి మాజీ డిజీ ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడాన్ని తప్పు పట్టారు గడికోట శ్రీకాంత్ రెడ్డి.
* స్పందించిన గడికోట శ్రీకాంత్ రెడ్డి..
జగన్మోహన్ రెడ్డి పై( Jagan Mohan Reddy) హత్యాయత్నం చేసిన వ్యక్తితో చర్చించడం ఏమిటని గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. వివేకా హత్య కేసులు మేమే చంపము అని ఒప్పుకున్న వ్యక్తిని బెయిల్ పై బయటకు తెచ్చి తిప్పుతున్నారన్నారు. ఇందులో ప్రమేయం లేని వారిని ఇరికించాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. తాజా పరిస్థితులు చూస్తుంటే ఈసారి పక్కా ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి పై హత్యాయత్నం చేయనున్నారని అర్థమవుతోందన్నారు. జగన్ పర్యటనల్లో భద్రతాలో పాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఏఐ సైతం ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడిగా చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
Also Read : రాజకీయాల్లోకి ఆ మాజీ ఐపీఎస్ అధికారి!