Mad Square Closing Collections: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై యూత్ ఆడియన్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square). 2023 వ సంవత్సరం లో విడుదలైన ‘మ్యాడ్’ చిత్రానికి ఇది సీక్వెల్. అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం ట్రేడ్ ని సర్ప్రైజ్ చేస్తూ పెద్ద కమర్షియల్ హిట్ గా నిల్చింది. ముఖ్యంగా ఓటీటీ లో విడుదల అయ్యాక ఈ చిత్రానికి క్లాసిక్ అనే పేరొచ్చింది. అలాంటి చిత్రానికి సీక్వెల్ అంటే షూటింగ్ ప్రారంభ దశ నుండే అంచనాలు ఏర్పడుతాయి. ఈ చిత్రానికి కూడా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, పాటలు కూడా పెద్ద హిట్ అవ్వడంతో కచ్చితంగా ఈ చిత్రం ‘మ్యాడ్’ కంటే బాగుంటుందని అందరు అనుకున్నారు. కానీ ఆ రేంజ్ లో అయితే ఈ చిత్రం ఆడియన్స్ ని అలరించలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read: ‘నా సినిమాకి మీలాంటోళ్ళు రాకూడదు’ అంటూ హీరో నాని కామెంట్స్!
మంచి రెస్పాన్స్ అయితే కచ్చితంగా వచ్చింది కానీ, చూసిన ప్రతీ ఒక్కరు ఈ చిత్రంకంటే మ్యాడ్ బాగుందని అంటున్నారు. అందుకే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా హిట్ అయ్యింది, బయ్యర్స్ అందరికీ లాభాలు వచ్చాయి కానీ, ఆశించిన స్థాయి లాభాలు మాత్రం రాలేదు. వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కచ్చితంగా కొడుతుందని అనుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో ఎంత వరకు రాబట్టిందో ఒకసారి చూద్దాం. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు , 51 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అందులో నైజాం ప్రాంతం నుండి 13 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ ప్రాంతం నుండి 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మిగిలిన 13 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ లోని మిగిలిన ప్రాంతాల నుండి వచ్చాయి.
అదే విధంగా ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కచ్చితంగా వంద కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతుంది అనుకున్న సినిమా, ఆ రేంజ్ కి చేరకపోవడం అంటే కచ్చితంగా టార్గెట్ ని అందుకోలేదు అన్నట్టే కదా. ఓవర్సీస్ ప్రాంతంలో ఈ చిత్రానికి 6 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చాయి. అక్కడ కూడా బయ్యర్స్ కి లాభాలు వచ్చాయి కానీ భారీ లాభాలు రాలేదు. అదే విధంగా కర్ణాటక ఈ చిత్రానికి కేవలం రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతంలో వసూళ్లు బాగా తగ్గాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బయ్యర్స్ కి 17 కోట్ల రూపాయలకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది.