Homeఎంటర్టైన్మెంట్Hero Nani : మహేష్ బాబు తర్వాత నానినే, బడా స్టార్స్ కూడా ఆయన వెనకే!

Hero Nani : మహేష్ బాబు తర్వాత నానినే, బడా స్టార్స్ కూడా ఆయన వెనకే!

Hero Nani : నాని కెరీర్ సక్సెస్ ట్రాక్ లో దూసుకెళుతుంది. ఆ మధ్య విజయాలు లేక నాని ఇబ్బందిపడ్డారు. MCA అనంతరం ఆయన నటించిన దేవదాస్, జెర్సీ, వి, టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న జెర్సీ కమర్షియల్ గా ఆడలేదు. శ్యామ్ సింగరాయ్ మాత్రం ఓ మోస్తరు లాభాలు అందుకుంది. అంటే సుందరానికీ నాని కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో ఆయన దసరా టైటిల్ తో ఛాలెంజింగ్ రోల్ చేశాడు. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడు.

Also Read : ఆయన రుణం తీర్చుకోవాలని అనుకుంటున్న హిట్ 3 డైరెక్టర్, కానీ?

నాని నమ్మకాన్ని నిలబెడుతూ దసరా భారీ విజయం నమోదు చేసింది. అనంతరం హాయ్ నాన్న మూవీతో నాని మరో విజయం ఖాతాలో వేసుకున్నాడు. సరిపోదా శనివారం మాత్రం నిరాశపరిచింది. హిట్ 3 మూవీతో నాని మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 3 మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగా మాత్రం సత్తా చాటుతుంది. హిట్ 3 వరల్డ్ వైడ్ రెండో రోజుల్లో రూ. 65 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం.

శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా హిట్ 3 తెరకెక్కింది. మే 1న థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ భారీ లాభాల దిశగా దూసుకువెళుతుంది. హిట్ 3 చిత్రానికి యూఎస్ లో విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే వన్ మిలియన్ వసూళ్లు దాటేసింది. దాంతో నాని అరుదైన ఫీట్ సొంతం చేసుకున్నాడు. నాని నటించిన చిత్రాల్లో మొత్తం 11 యూఎస్ లో $ 1 మిలియన్ మార్కును దాటాయి. ఈ ఫీట్ అందుకున్న రెండో హీరోగా నాని రికార్డులకు ఎక్కాడు. కేవలం మహేష్ బాబు మాత్రమే నాని కంటే ముందు ఉన్నాడు.

నాని నటించిన 4 సినిమాలు వరుసగా $ 1.5 మిలియన్ వసూళ్లు దక్కించుకున్నాయి. ఇది కూడా ఒక రికార్డు కాగా, మహేష్ బాబు మాత్రమే గతంలో ఈ ఫీట్ సాధించారు. టాలీవుడ్ బడా స్టార్స్ ని కూడా వెనక్కి నెట్టి యూఎస్ లో తన సత్తా చాటాడు నాని. మహేష్ బాబు అనంతరం యూఎస్ లో నానికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఈ రికార్డులు తెలియజేస్తున్నాయి.

Exit mobile version