https://oktelugu.com/

Naga Chaitanya: సమంత దారిలోనే నాగ చైతన్య.. తొలిసారి ఆ పాత్రలో కనిపించేందుకు సిద్ధం!

Naga Chaitanya: కరోనా కారణంగా థియేటర్లు మూతబడిన వేళ ఓటీటీ హవా విస్తారంగా పెరిగింది. జనాలు ఇంట్లోనే సినిమాలు వీక్షించేందుకు ఇష్టపడుతుండటంతో.. ఈ ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లో సినిమాలు విడుదలవ్వడం ప్రారంభిచాయి. ముఖ్యంగా వెబ్​సిరీస్​లో ఈ మధ్యలో పెను సంచలనం సృష్టించాయి.  స్టార్​ హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్​ సిరీస్​ల్లో నటించేందుకు  ఇటీవల కాలంలో వెనకాడటం లేదు. మరోవైపు బడా నిర్మాణ సంస్థలు కూడా ఈ రంగంలోకి అడుగుపెడుతుండటంతో ఓటీటీ హవా ప్రస్తుతం నడుస్తోంది. ఈ క్రమంలోనే సమంత, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 7, 2021 / 11:45 AM IST
    Follow us on

    Naga Chaitanya: కరోనా కారణంగా థియేటర్లు మూతబడిన వేళ ఓటీటీ హవా విస్తారంగా పెరిగింది. జనాలు ఇంట్లోనే సినిమాలు వీక్షించేందుకు ఇష్టపడుతుండటంతో.. ఈ ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​లో సినిమాలు విడుదలవ్వడం ప్రారంభిచాయి. ముఖ్యంగా వెబ్​సిరీస్​లో ఈ మధ్యలో పెను సంచలనం సృష్టించాయి.  స్టార్​ హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్​ సిరీస్​ల్లో నటించేందుకు  ఇటీవల కాలంలో వెనకాడటం లేదు. మరోవైపు బడా నిర్మాణ సంస్థలు కూడా ఈ రంగంలోకి అడుగుపెడుతుండటంతో ఓటీటీ హవా ప్రస్తుతం నడుస్తోంది. ఈ క్రమంలోనే సమంత, తమన్న వంటి స్టార్​ హీరోయిన్లు వెబ్ సిరీస్​ల్లో కనిపంచి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఇదే బాటలో నడిచేందుకు హీరోలూ సిద్ధమవుతున్నారు. తాజాగా, టాలీవుడ్​లో సరికొత్త ట్రెండ్​కు శ్రీకారం చుట్టారు యంగ్​హీరో నాగచైతన్య.

    విక్రమ్ కుమార్​ దర్శకత్వం వహిస్తోన్న ఓ వెబ్​సిరీస్​లో నాగచైతన్య నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా, ఈ విషయంపై నాగచైతన్య స్వయంగా స్పందించారు. తాను వెబ్​సిరీస్​లో నటిస్తున్నట్లు ధృవీకరించారు. అంతే కాకుండా ఈ సిరీస్​ హర్రర్​ కథాంశంతో రానున్నట్లు తెలిపారు. ఇందులో నెగెటివ్​ షెడ్స్​ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. నాగ చైతన్య తన కెరీర్​లో ఇటువంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి.

    మరోవైపు ఇటీవల లవ్​స్టోరీ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన చైతన్య.. సూపర్​ హిట్​ కొట్టారు. కాగా, ఇందులో సాయిపల్లవి హీరోయిన్​గా నటించింది. వీరిద్దరు కలిసి వేసిన స్టెప్పులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు థాంక్యూ సినిమాలోనూ హీరోగా కనిపించనున్నారు చైతన్య. దీంతో పాటు అమీర్​ ఖాన్​ హీరోగా వస్తోన్న ఫారెస్ట్ గంప్​ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.