https://oktelugu.com/

Naga Shaurya : రంగబలి సక్సెస్ మీట్ నుండి కోపంగా వెళ్లిన హీరో నాగ శౌర్య… ఏం జరిగిందంటే?

దర్శకుడు సమాధానానికి జర్నలిస్ట్ సంతృప్తి చెందలేదు. అప్పుడు మైక్ తీసుకున్న నాగ శౌర్య.. ప్రతి కథలో పుట్టుపూర్వోత్తరాలు చెప్పాలంటే మాది 17 గంటల సినిమా అవుతుంది. బాహుబలి లాంటి చిత్రమైతే 20 గంటలు పడుతుంది. సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అర్థం చేసుకొని అవి వదిలేయాలి అన్నాడు. వెంటనే ప్రెస్ మీట్ నుండి లేచి వెళ్ళిపోయాడు.

Written By:
  • Shiva
  • , Updated On : July 9, 2023 / 08:14 AM IST
    Follow us on

    Naga Shaurya : యంగ్ హీరో నాగ శౌర్య లేటెస్ట్ మూవీ రంగబలి. జులై 7న విడుదల చేశారు. నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి తెరకెక్కించాడు. మూవీకి మిక్స్డ్ టాక్ దక్కింది. నేడు చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ నుండి హీరో నాగ శౌర్య కోపంగా వెళ్లిపోయారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన చిరాకు పడ్డారు. రంగబలి చిత్ర కథను ప్రస్తావిస్తూ… ఊర్లో పుట్టి పెరిగిన కుర్రాడికి రంగబలి సెంటర్ చరిత్ర తెలియకపోవడం ఏమిటని దర్శకుడిని అడిగారు. హీరోకి ఆ సెంటర్ కి పేరు ఎలా వచ్చిందో తెలుసు. మురళీ శర్మతో ఓ సన్నివేశంలో చెప్పాడు కదా… అన్నాడు. 

     
    దర్శకుడు సమాధానానికి జర్నలిస్ట్ సంతృప్తి చెందలేదు. అప్పుడు మైక్ తీసుకున్న నాగ శౌర్య.. ప్రతి కథలో పుట్టుపూర్వోత్తరాలు చెప్పాలంటే మాది 17 గంటల సినిమా అవుతుంది. బాహుబలి లాంటి చిత్రమైతే 20 గంటలు పడుతుంది. సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అర్థం చేసుకొని అవి వదిలేయాలి అన్నాడు. వెంటనే ప్రెస్ మీట్ నుండి లేచి వెళ్ళిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 
     
    ఇది కూడా రంగబలి ప్రొమోషన్స్ లో భాగం కావచ్చు. మూవీకి ప్రచారం కల్పించేందుకు వివాదం సృష్టించి ఉండొచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రంగబలి చిత్ర ఓపెనింగ్స్ చాలా పూర్ గా ఉన్నాయి. నాగ శౌర్య గత చిత్రాలు పరాజయం పొందిన నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ రంగబలి చిత్రం మీద పడింది. కనీస వసూళ్లు దక్కలేదని ట్రేడ్ వర్గాల వాదన. సక్సెస్ మీట్ ద్వారా ప్రేక్షకులను ఆకర్షించవచ్చని యూనిట్ భావించారు. బ్యాడ్ టాక్ మధ్య సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. 
     
    ఇక నాగ శౌర్యకు ఛలో చిత్రం తర్వాత క్లీన్ హిట్ లేదు. ఆ మధ్య వచ్చిన అశ్వద్ధామ పర్లేదు అనిపించుకుంది. లక్ష్య టైటిల్ తో ఓ స్పోర్ట్స్ డ్రామా చేశాడు. ఆ చిత్రం కోసం నాగ శౌర్య బాగా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ చేశాడు. లక్ష్య కెరీర్ కి బ్రేక్ ఇచ్చే మూవీ అవుతుందని నమ్మాడు. లక్ష్య సైతం నిరాశపరిచింది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి దారుణ ఫలితం చూసింది. నెక్స్ట్ ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో చేయనున్నాడు. అది ఆయన సొంత బ్యానర్ లో తెరకెక్కుతుంది.