Homeఅంతర్జాతీయంVenezuelan Oil Price: చవకగా వెనెజువెలా ఆయిల్‌.. కొంటే రూ.27 కోట్లు ఆదా

Venezuelan Oil Price: చవకగా వెనెజువెలా ఆయిల్‌.. కొంటే రూ.27 కోట్లు ఆదా

Venezuelan Oil Price: అగ్రరాజ్యం అమెరికా చమరు నిల్వలు ఎక్కడ ఉంటే.. ఆదేశంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అవసరమైతే దాడిచేసి దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. ఇందులో భాగంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెనెజువెలాపై రహస్య ఆపరేషన్‌ నిర్వహించారు. అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను కిడ్నాప్‌ చేయించి, న్యూయార్క్‌ కోర్టులో దోషులుగా నిలబెట్టారు. వెనెజువెలాలోని ఆయిల్‌ మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే వెనెజువెలా తాత్కాలిక ప్రభుత్వం కూడా అమెరికా ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదు. దీంతో ఇటీవల భారత్‌కు వచ్చిన ఆదేశ మంత్రి భారత్‌తో కీలక ఒప్పందాలు చేసుకున్నా. ఇందులో ఆయిల్‌ కొనుగోలు ఒప్పందం కూడా ఉంది. అయితే ఈ క్రెడిట్‌ భారత్, వెనెజువెలాకు దక్కకుండా డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం ప్రారంభించారు. భారత్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందం సందర్భంగా ఆయిల్‌ కొనుగోలుపై కీలక ప్రకటన చేశారు.

చవకగా చమురు..
అమెరికాతో వాణిజ్య ఒప్పందం అంగీకారంతో భారత్‌ వెనెజువెలా నుంచి ముడి చమురు కొనుగోళ్లు పెంచుతోంది. ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం, రష్యా దిగుమతులకు బదులు వెనెజువెలా ఎంచుకుంటే ఏటా 3 బిలియన్‌ డాలర్లు (రూ.27,000 కోట్లు) ఆదా అవుతుంది. వెనెజువెలా ముడి చమురు బ్యారెల్‌ ధర రూ.51 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 10–12 డాలర్ల డిస్కౌంట్‌తో రవాణా, ఇతర ఖర్చులు తీస్తే కూడా పెద్ద ఆదా. రష్యా డిస్కౌంట్‌ స్థిరంగా ఉండకపోవచ్చని నివేదిక సూచిస్తోంది.

రవాణా, సమయ ఖర్చులు ఎక్కువ..
వెనెజువెలా భౌగోళికంగా దూరం కారణంగా రవాణా సమయం పశ్చిమాసియా చమురుకు 5 రెట్లు ఎక్కువ. రష్యాకు కన్న రెంట్టింపు దూరం. దీంతో బీమా, రవాణా ఖర్చులు పెరుగుతాయి. మరోవైపు ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం ముగిస్తే రష్యా డిస్కౌంట్‌ ఎత్తివేసే అవకాశం ఉంది. అప్పుడు భారత్‌పై భారం పడుతుంది. దీంతో మోదీ ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా వెనెజువెలా ఆయిల్‌ కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

అమెరికా ఒప్పందంతో వెనెజువెలా చమురు మార్పు భారత దిగుమతుల బిల్లును తగ్గిస్తుంది. రష్యా ఆధారాలు తగ్గడం జియోపాలిటికల్‌ రిస్కులను మెరుగు పరుస్తుంది. ఖర్చులు పరిగణించి మల్టీ సోర్సింగ్‌ వ్యూహం అవలంబిస్తే దీర్ఘకాల లాభం సాధ్యమే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version