Peddi Vs Ustaad Bhagat Singh: ‘ఓజీ’ చిత్రం సక్సెస్ తర్వాత మెగా ఫ్యామిలీ కి మహర్దశ పట్టింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టి రీజనల్ మూవీస్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలబడడం , అదే నెలలో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవలపిల్లలు పుట్టడం వంటివి జరిగాయి. ఇదే ఉత్సాహం రాబోయే రోజుల్లో కూడా కచ్చితంగా కొనసాగుతుందని మెగా అభిమానులు బలమైన నమ్మకం తో ఉన్నారు. నేడు మెగా ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh), రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రాలకు సంబంధించిన విడుదల తేదీలను అధికారికంగా పోస్టర్స్ ద్వారా తెలిపారు మేకర్స్.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న విడుదల కాబోతుండగా, ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కాబోతుంది. రెండు సినిమాలకు సరిగ్గా నెల రోజుల గ్యాప్ ఉంది , ఈ రెండు చిత్రాలను కూడా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థనే నిర్మించింది. ముందుగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీని ప్రకటించారు. ఆ తర్వాత గంటకు ‘పెద్ది ‘ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ రెండు చిత్రాల్లో దేనికి ఎక్కువ ఓపెనింగ్ వసూళ్లు వస్తాయి?, ఏ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే దానిపై సోషల్ మీడియా లో ఇప్పటి నుండే చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ‘పెద్ది’ చిత్రానికి ఎక్కువ హైప్, క్రేజ్ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ వేరే లెవెల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ‘చికిరి చికిరి’ పాటకు గ్లోబల్ వైడ్ సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. గ్లింప్స్ వీడియో కి కూడా రెస్పాన్స్ అదిరింది.
ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తప్ప ఈ సినిమాలో మరో పాజిటివ్ ఎలిమెంట్ కనపడడం లేదు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఫామ్ లో లేడు, ఇప్పటి వరకు విడుదల చేసిన రెండు గ్లింప్స్ వీడియోస్ యావరేజ్ అనిపించుకున్నాయి, అదే విధంగా రీసెంట్ గా విడుదల చేసిన ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు కూడా యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. పైగా రొటీన్ కమర్షియల్ సినిమా కావడం తో, ఈ చిత్రానికి కావాల్సినంత బజ్ ఏర్పడడం లేదు. ప్రస్తుతానికి అయితే పెద్ది చిత్రానికి 150 కోట్ల రూపాయలకు పైగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.