Kia EV3 : కియా నుంచి సరికొత్త ఈవీ.. ఆ కంపెనీ ఈవీలకు చెక్‌ పడుతుందా..?

ఈవీ3లో GT లైన్ వేరియంట్లు ఉన్నాయి. ఇవి స్పోర్టియర్ బంపర్స్‌తో ఉంటాయి. కొలతల పరంగా చూస్తే ఈవీ 34,300 మిమీ పొడవు, 1,850 మిమీ వెడల్పు, 1,560 మిమీ ఎత్తు, 2,680 మిమీ వీల్ బేస్‌ కలిగి ఉంది.

Written By: NARESH, Updated On : May 25, 2024 9:45 pm

Kia EV3

Follow us on

Kia EV3 : దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ భారత మార్కెట్లో నిలదొక్కుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఇండియాలో దిగ్గజ కంపెనీలైన టాటా, మారుతి సుజుకీ లాంటి కంపెనీలతో పోటీ పడుతుంది. అన్ని వేరియంట్లలో పోటీ ఉండాలని ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ)లతో ముందుకు వస్తుంది.

కియా ఇటీవల ఒక కొత్త ఈవీ3 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రిలీజ్ చేసింది. ఈవీ9, ఈవీ6, ఈవీ5 తర్వాత వస్తున్న ఎస్‌యూవీ ఇదే. దీని గత మోడళ్ల మాదిరిగానే ఇది కూడా E-GMP మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి పని చేస్తుంది. ఈ కారులో ఇంటీరియర్ తో సహా అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

Kia EV3

ఈ ఈవీ3 ఎలక్ట్రిక్ కారు జూన్, 2024 మొదటి వారంలో సౌత్ కొరియా మార్కెట్ లో విడుదల కానుంది. 2024 చివరలో యూరప్‌, 2025 ప్రారంభంలో ఆసియా మార్కెట్ లో లాంచ్ చేస్తామని కియా మోటార్స్ ప్రతినిధులు చెప్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల ఈవీ3 యూనిట్ల అమ్మకాలు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Kia unveils new EV3 electric SUV

ఈవీ2లోని ఫీచర్లు..
ఈవీ3లో 12 ఇంచుల హెడ్-అప్ డిస్ ప్లే, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ డిస్ ప్లేలు, హర్మన్ కార్డాన్ సౌండ్ సిస్టం, ADAS సూట్‌ ఉంటాయి. దీనిలో ఏఐ అసిస్టెంట్ ఉంది. ఈ ఫీచర్‌ కలిగిన ఏకైక కియా కారు ఈవీ3నే. త్వరలో దశలవారీగా ఇతర ఈవీల్లో ఈ ఫీచర్‌ ను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ అనుకుంటుంది.

ఈ కారులో 2 బ్యాటరీ ప్యాకుల ఆప్షన్స్‌ ఉన్నాయి. స్టాండర్డ్ మోడల్ 58.3 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్‌, లాంగ్-రేంజ్ వేరియంట్ 81.4 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ 2 వెర్షన్లలో వస్తుంది. ఇది 201 బీహెచ్‌పీ పవర్ వద్ద 283 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారు 7.5 సెకన్లలో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఈ ఈవీ గరిష్ట వేగం గంటకు 170 కిలో మీటర్లుగా నిర్ధారించారు. ఈ వెర్షన్ 600 కిలో మీటర్ల రేంజ్‌ వరకు ప్రయాణిస్తుందని చెప్తున్నారు. 400 వోల్ట్ కరెంట్‌తో బ్యాటరీ 10 నుంచి 80 శాతం ఛార్చి అయ్యేందుకు 31 నిమిషాలు పడుతుంది. ఈ కారులో 460 లీటర్ల బూట్ స్పేస్‌, అదనంగా 25 లీటర్ల ఫ్రంక్ (కారు ముందు భాగంలోని స్పేస్‌) ఉన్నాయి.

ఈ కారు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పెద్ద గ్లాస్ హౌస్ దాని సైడ్ ప్రొఫైల్‌కి ఎక్స్ ట్రా లుక్‌ ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో స్లోయింగ్ రూఫ్ లైన్, నిలువుగా టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ బంపర్, రియర్ స్పాయిలర్, ముందు వెనుక ఫెండర్లలో ట్రాపెజోడల్ క్రీజులు ఉన్నాయి. వీటితో పాటు అధునాతన ఫీచర్లను ఉన్నాయి.

ఈవీ3లో GT లైన్ వేరియంట్లు ఉన్నాయి. ఇవి స్పోర్టియర్ బంపర్స్‌తో ఉంటాయి. కొలతల పరంగా చూస్తే ఈవీ 34,300 మిమీ పొడవు, 1,850 మిమీ వెడల్పు, 1,560 మిమీ ఎత్తు, 2,680 మిమీ వీల్ బేస్‌ కలిగి ఉంది. ఈ కారు ధర 35,000 డాలర్ల నుంచి 50,000 డాలర్లు (సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 42 లక్షలు) ఉండవచ్చు