https://oktelugu.com/

Mahesh Babu: త్రివిక్రమ్​- మహేశ్​ కాంబో.. విలన్​కు ఎందుకంత ప్రాధాన్యం?

Mahesh Babu: సూపర్​స్టార్​ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తోందంటే చాలు.. ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొంటాయి. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన అతడు, ఖలేజా ఎంత విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్​ తన సినిమాకు కొన్ని సిద్ధాంతాలు ఫాలో అవుతాడని ఆయన సినిమాలు ఫాలో అయినవాళ్లకు బాగా తెలుస్తుంది. తన సినిమాలో హీరోలను ఎంత తెలివిగా చూపిస్తాడో.. విలన్లను కూడా అంతే ధీటుగా చూపిస్తాడు. ఇంకా చెప్పాలంటే.. హీరో కంటే విలన్​కే తెలివెక్కువ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 22, 2021 / 10:24 AM IST
    Follow us on

    Mahesh Babu: సూపర్​స్టార్​ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తోందంటే చాలు.. ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొంటాయి. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన అతడు, ఖలేజా ఎంత విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రివిక్రమ్​ తన సినిమాకు కొన్ని సిద్ధాంతాలు ఫాలో అవుతాడని ఆయన సినిమాలు ఫాలో అయినవాళ్లకు బాగా తెలుస్తుంది. తన సినిమాలో హీరోలను ఎంత తెలివిగా చూపిస్తాడో.. విలన్లను కూడా అంతే ధీటుగా చూపిస్తాడు. ఇంకా చెప్పాలంటే.. హీరో కంటే విలన్​కే తెలివెక్కువ అన్నట్లు చూపిస్తాడు.

    అందుకే, త్రివిక్రమ్​ సినిమాలంటే ఓ రకమైన ఆసక్తి నెలకొంటుంది. ఇక మహేశ్​తో కలిసి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం ఈ మాటల మాంత్రికుడు ఓ బలమైన విలన్​ పార్తను సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో తమిళ హీరో ఆర్య కనిపించనున్నట్లు సమాచారం. కాగా, ఈ విషయంపై ఆర్యతో ముచ్చటించగా.. ఆర్య కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో.. త్వరలోనే బడ్జెట్​పై ఓ నిర్ణయం తీసుకుని సినిమా మొదలు పెట్టనున్నట్లు సమాచారం. ‘అరవింద సమేత, ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ చేస్తోన్న సినిమా ఇది. అందుకే ఈ సినిమాకి రెట్టింపు భారీ అంచనాలు ఉన్నాయి.

    మరోవైపు, సర్కారు వారి పాట సినిమాతో ప్రస్తుతం ఫుల్​ బిజీగా ఉన్నారు మహేశ్​. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా… ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వెన్నెల కిశోర్, సుబ్బరాజు కీలకపాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్​లో ఈ సినిమా విడుదల కానుంది.