Bheemla Nayak: టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ఎదిగారు సూర్యదేవర నాగవంశీ. టాలీవుడ్ లో తిరుగులేని శక్తులుగా ఉన్న నందమూరి, మెగా ఫ్యామిలీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నిర్మాత హిట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువే కాగా, క్రేజీ ప్రాజెక్ట్స్ కి నిర్మాతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బ్యానర్ లో భీమ్లా నాయక్ తెరకెక్కింది. ఈ మూవీ విడుదల తేదీపై పెద్ద వివాదం నెలకొంది. దీనిని వివాదం అనడం సరికాదు కానీ.. చిన్న సందిగ్ధత ఏర్పడింది. ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు తమ కోసం భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.

ఆర్ ఆర్ ఆర్ విడుదల జనవరి 7న కాగా, ఐదు రోజుల తర్వాత జనవరి 12న భీమ్లా నాయక్ విడుదల కానుంది. థియేటర్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని, దాని కారణంగా వసూళ్లు తగ్గే అవకాశం ఉందని ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదట నిర్మాత నాగవంశీతో ఆర్ ఆర్ ఆర్ నిర్మాతలు అనధికారిక చర్చలు జరిపారు. అవి ఫలించలేదు, దానితో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశం ఏర్పాటు చేయించి, నాగవంశీపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. అయినా నాగవంశీ తలొగ్గలేదు, భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు.
ఈ విషయంలో రాజమౌళి, దానయ్యతో పాటు దిల్ రాజు వంటి పెద్దలు నాగవంశీపై తెస్తున్న ఒత్తిడి ఆయన మనసుకు గాయం చేసినట్లు అనిపిస్తుంది. వాళ్ళ చర్యలతో విసిగిపోయిన నాగవంశీ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘గుర్తు పెట్టుకోండి… ఈసారి కూడా మిస్ అయ్యేది లేదు. జనవరి 12న వస్తున్నాం’ అంటూ ఫోటోతో పాటు ఓ కామెంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేయించలేరని నాగవంశీ రాజమౌళితో పాటు ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్లు అయ్యింది.
Also Read: Hero Simbu: ఆ సినిమా కోసం శింబు ఏకంకా ఎన్ని కిలోలు తగ్గారో తెలుసా?
అయితే నాగవంశీ ఈ నిర్ణయం ఆయనకు చేటు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ భారీ విజయం సాధిస్తే, అది భీమ్లా నాయక్ వసూళ్లను తీవ్రంగా దెబ్బతీస్తుంది. పండుగకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో సంక్రాంతి చదరంగం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
Also Read: Akhada: ‘అఖండ’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్తో వచ్చిన థమన్