Arjun’s Daughter engagement : ఘనంగా అర్జున్ కూతురు నిశ్చితార్థం.. ఎవరెవరు పాల్గొన్నారంటే.. ఫొటోలు వైరల్

ఈ క్రమంలోనే ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారని టాక్. ఇక ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. దీంతో పెళ్లికి లైన్ క్లియర్ అయింది.

Written By: NARESH, Updated On : October 28, 2023 11:50 am
Follow us on

Arjun’s Daughter engagement : ఈ మధ్య పెళ్లిళ్ల సందడి చాలానే మొదలైంది. త్వరలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక త్వరలో మరో జంట కూడా పెళ్లి బంధంతో ఒకటి కాబోతుంది. ప్రముఖ నటుడు అర్జున్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈయన పెద్ద కుమార్తె ఐశ్వర్యనే త్వరలో వివాహ బంధం లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అంతేకాదు రీసెంట్ గానే ఈ అమ్మడుకు నిశ్చితార్థం కూడా జరిగింది. మరి ఆ నటుడు ఎవరు? వీరి వేడుకకు ఎవరెవరు వచ్చారు అనే వివరాలు మీకోసం..

కోలీవుడ్ దిగ్గజ నటుడు తంబి రామయ్య కొడుకు, నటుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్యకు పెళ్లి కానుంది. ఈ జంటకే తాజాగా ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే వీరిది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లా అనే సందేహం మీలో కలిగే ఉంటుంది. కానీ కొన్నాళ్లుగా ప్రేమించుకొని పెద్దల అంగీకారంతో నిన్న చెన్నైలో నిశ్చితార్థం చేసుకున్నారు ఈ జంట. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కానీ కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖుల మధ్య వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రేమ ఎలా చిగురించింది?
మరి వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందంటే..ఈ జంట కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాలిటీ షోలో ఉమాపతి పాల్గొనడంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడిందట. ఈ క్రమంలోనే ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారని టాక్. ఇక ఈ విషయాన్ని ఇంట్లో చెప్పడంతో ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. దీంతో పెళ్లికి లైన్ క్లియర్ అయింది.