Bad Newz Movie Review: ‘బ్యాడ్ న్యూజ్’ ఫుల్ మూవీ రివ్యూ…

బాలీవుడ్ ఇండస్ట్రీ ఇక మీదట తన మనుగడను కొనసాగించాలంటే మాత్రం సక్సెస్ ఫుల్ సినిమాలు రావాలి. లేకపోతే మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీని టాలీవుడ్ ఇండస్ట్రీ డామినేట్ చేస్తూనే పోతుంది. మరి ఇలాంటి క్రమంలో 'అనిమల్ ' సినిమాలో ఒక కీలకపాత్రలో నటించిన త్రిప్తి డిమ్రి ఆ సినిమా తో మంచి పేరు తెచ్చుకుంది.

Written By: Gopi, Updated On : July 19, 2024 10:39 am

Bad Newz Movie Review

Follow us on

Bad Newz Movie Review: బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోలు సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన మేరకు సక్సెసులు అయితే సాధించడం లేదు. గతేడాది చివర్లో వచ్చిన ‘అనిమల్ ‘ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు ఒక్క సక్సెస్ ను కూడా సాధించలేక పోతుంది. కారణం ఏదైనా కూడా వాళ్లు చేసే సినిమాలు అక్కడి ప్రేక్షకులకు నచ్చడం లేదు. దాంతో వాళ్ళు భారీ సినిమాలు చేసినప్పటికీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. ఇక అక్షయ్ కుమార్ అయితే వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ వచ్చినవి వచ్చినట్టుగా ఫ్లాప్ అవుతున్నాయి. ఇక ఇప్పటికి వరుసగా 13 ప్లాప్ లు వచ్చాయి. ఇక రీసెంట్ గా వచ్చిన సర్ఫీరా సినిమా కూడా ఆశించిన మేరకు విజయం అయితే అందించలేదు.

మరి ఇలాంటి క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీ ఇక మీదట తన మనుగడను కొనసాగించాలంటే మాత్రం సక్సెస్ ఫుల్ సినిమాలు రావాలి. లేకపోతే మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీని టాలీవుడ్ ఇండస్ట్రీ డామినేట్ చేస్తూనే పోతుంది. మరి ఇలాంటి క్రమంలో ‘అనిమల్ ‘ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించిన త్రిప్తి డిమ్రి ఆ సినిమా తో మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఆమె మరోసారి బోల్డ్ గా చేసిన ‘బ్యాడ్ న్యూజ్’ అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది… త్రిప్తి డిమ్రి కి మంచి సక్సెస్ లభించిందా? లేదా అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సలోని బగ్గ (త్రిప్తి డిమ్రి) అనే అమ్మాయి ఒకేసారి ఇద్దరిని లవ్ చేస్తుంది. ఇక ఒకేరోజు నైట్ వాళ్ళిద్దరితో శృంగారం లో పాల్గొంటుంది. ఇక ఆ ఇద్దరి లో ఒకరు అఖిల్ చద్దా (విక్కి కౌశల్) కాగా, మరొకరు గుబిర్ పన్ను (అమ్మి విర్క్)…ఇక వీళ్లిద్దరి వాళ్ల ఆమెకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒకరోజు హ్యాపిటల్ వెళ్లిన సలోని కి డాక్టర్ ఆమె కడుపులో కవల పిల్లలు ఉన్నారని చెప్తారు. ఇక ‘హెటోరో పేరెంటల్ సూపర్ ఫేకండేషన్’ ద్వారా ఇద్దరు పురుషుల ద్వారా ఇద్దరు పిల్లల్ని కనబోతున్న అని అందరికీ చెబుతూ ఉంటుంది…మరి తను అలా ఎందుకు ఇద్దరి వ్యక్తుల ద్వారా ఇద్దరు పిల్లల్ని కనాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఎలా రియాక్టు అయ్యారు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు ‘ఆనంద్ తివారీ’ ఒక కొత్త కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడనే చెప్పాలి… అయితే మొదటి నుంచి కూడా ఈ సినిమాని చాలా గ్రిప్పింగ్ గా తీసుకెళ్లాలనే ప్రయత్నం అయితే చేశాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా నుంచి ఎక్కడ అవుట్ అఫ్ ది బాక్స్ వెళ్లకుండా సినిమాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఎంచుకున్న పాయింట్ చాలా కాంప్లికేటెడ్ కావడంతో ఒకానొక సందర్భంలో మాత్రం ఆయన చాలా వరకు కన్ఫ్యూజన్ కి గురైనట్టుగా తెలుస్తుంది… రెగ్యులర్ కమర్షియల్ కథలను డీల్ చేయడం వేరు ఇలాంటి సాహసోపేతమైన కథను ఎంచుకొని ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని… ఇక ఫస్ట్ లో సెటప్ అంతా బాగా చేసుకున్న దర్శకుడు సినిమా స్టార్ట్ అయిన ఒక 45 నిమిషాలు గడిచిన తర్వాత సినిమా మీద తన గ్రిప్టింగ్ అయితే కోల్పోయాడు.

నిజానికి సినిమా ఏ వే లో స్టార్ట్ అయి ఎటు నుంచి ఎటు వెళ్తుందో కూడా అర్థం కానీ పరిస్థితిలో ఆడియన్స్ ఉంటారు. సెకండ్ ఆఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ ను మాత్రం దర్శకుడు చాలా సెన్సిటివ్ గా డీల్ చేశాడు. అందువల్లే ఈ సినిమా కొంతవరకు నిలబడే అవకాశం అయితే ఉంది. ఇక మొత్తానికైతే త్రిప్తి డిమ్రి ని చాలా బాగా వాడుకున్నాడు. ఆమెను యాక్టింగ్ పరంగానే కాకుండా బోల్డ్ సీన్స్ లో కూడా చాలా బాగా చూపించి కుర్రకారు హృదయాలను దోచుకునే ప్రయత్నం చేశాడు… ఇక కుర్రాళ్ళు త్రిప్తి డిమ్రి ని ఎలాగైతే చూడాలి అనుకున్నారో అలాంటి పర్ఫెక్ట్ క్యారెక్టర్ లో తను నటించడమే కాకుండా జీవించేసిందనే చెప్పాలి…ఈ సినిమాలో ఉన్న ఒకటి రెండు ట్విస్టులు ఓకే అనిపించినప్పటికీ అవి పెద్దగా ఎలివేట్ అయితే అవ్వవు.

ఎందుకంటే కొంచెం ఇంటెలిజెంట్ గా ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా వాటిని ఈజీగా కనిపెట్టవచ్చు. ఇక ఈ సినిమాలో ఉన్న కోర్ ఎమోషన్ మాత్రం ఆడియన్స్ కి బాగా రీచ్ అయింది. దాన్ని డీల్ చేయడంలో దర్శకుడు కొంతవరకు సక్సెస్ సాధించాడు. ఇక ఇందులో బోల్డ్ సీన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి… ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం కొంచెం బోర్ గా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగింది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్ట్ పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తం త్రిప్తి డిమ్రి సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి చివరి వరకు కూడా తనే సినిమా మొత్తాన్ని సక్సెస్ ఫుల్ గా డీల్ చేసుకుంటూ ముందుకెళ్ళింది. తన యాక్టింగ్ ను చూసిన ప్రతి ఒక్కరు కూడా త్రిప్తి డిమ్రి లో ఇంత మంచి నటి ఉందా అని ఆశ్చర్యపోక తప్పదు. ఇక సెకండ్ ఆఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తను చాలా అద్భుతంగా నటించింది. ఆమెకు మంచి నటిగా గుర్తింపురావడమే కాకుండా ఈ సినిమా ద్వారా ఆమెకు చాలా మంచి ఆఫర్లు కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఏది ఏమైనప్పటికీ త్రిప్తి కి ఒక బెస్ట్ క్యారెక్టర్ దొరికిందనే చెప్పాలి… ఇక విక్కీ కౌశల్, అమ్మి విర్క్ లు వాళ్ల పాత్రల్లో వాళ్ళు చాలా బాగా చేశారు… ఇక మిగిలిన ఆర్టిస్టులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటిస్తూనే త్రిప్తి డిమ్రి చేసే సీన్లలో వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేస్తూ వచ్చారు…

టెక్నికల్ అంశాలు

ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అను మాలిక్ ఇచ్చిన మ్యూజిక్ కొంతవరకు ఒకే అనిపించినప్పటికీ ఓవరాల్ గా మాత్రం ఈ సినిమాకి తగ్గ న్యాయమైతే చేయలేదు. మ్యూజిక్ ఇంకాస్త బాగుండుంటే సినిమా మీద అంచనాలు మరింతగా పెరగడమే కాకుండా ఈ సినిమా కూడా ఇంకాస్త మంచి టాక్ తో ముందుకు దూసుకెళ్లేది. ఇక ఈ సినిమా విజువల్స్ అయితే చాలా రిచ్ గా ఉన్నాయి…అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి…

ప్లస్ పాయింట్స్

త్రిప్తి డిమ్రి యాక్టింగ్
కొన్ని ఎమోషనల్ సీన్స్
విజువల్స్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ ఆఫ్ కొంచెం బోరింగ్ గా సాగింది…
కొన్ని అనవసరమైన సీన్లు…

రేటింగ్
ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 2.5/5

చివరి లైన్
బోల్డ్ కంటెంట్ అయిన పర్లేదు చూస్తాం అనుకునే వాళ్ళు ఒకసారి చూడవచ్చు…