Homeఎంటర్టైన్మెంట్Buttabomma Movie : తెలుగు ప్రేక్షకులకు 'బుట్ట బొమ్మ' కొత్త అనుభూతినిస్తుంది- అర్జున్ దాస్

Buttabomma Movie : తెలుగు ప్రేక్షకులకు ‘బుట్ట బొమ్మ’ కొత్త అనుభూతినిస్తుంది- అర్జున్ దాస్

Buttabomma Movie : ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా నటుడు అర్జున్ దాస్ విలేకర్ల సమావేశంలో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

మీ సినీ ప్రయాణం గురించి చెప్పండి?
పెరుమాళ్ తర్వాత చాలాకాలం ఎదురుచూశాను. ఖైదీ, అంధఘారం, మాస్టర్ సినిమాల నుంచి కెరీర్ ఊపందుకుంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ గారి సినిమాలలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఆయన వల్లే ఇంత గుర్తింపు వచ్చింది. సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో ‘బుట్ట బొమ్మ’ సినిమా చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.

‘బుట్ట బొమ్మ’తో మీ ప్రయాణం ఎలా మొదలైంది?
ఒకసారి నిర్మాత వంశీ గారు ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. ఆయన నా మీద ఎంతో నమ్మకం ఉంచి, ఈ సినిమా ఖచ్చితంగా మీరే చేయాలని అన్నారు. మరుసటి రోజు దర్శకుడు రమేష్ చెన్నై వచ్చి నన్ను కలిసి కథ, పాత్ర గురించి వివరించారు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి వంశీ గారిని కలిసి ఈ సినిమాలో భాగం కావడం జరిగింది. అప్పటివరకు నేను వంశీ గారిని కలవలేదు. ఆ రోజే ఆయనను మొదటిసారి కలిశాను. పిలిచి మరీ నాకు ఈ అవకాశం ఇచ్చారు.

ఈ సినిమా మాతృక ఓటీటీలో అందుబాటులో ఉంది.. అయినా రీమేక్ చేయడానికి కారణం?
ఇదే ప్రశ్న నిర్మాత వంశీ గారిని అడిగాను. ఇది తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన నమ్మారు. అలాగే ఇక్కడ తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేయడం జరిగింది. సినిమా ఖచ్చితంగా అందరిని అలరిస్తుంది.

ఈ చిత్రంలో మీ పాత్ర గురించి చెప్పండి?
ఇందులో నా పాత్ర పేరు ఆర్.కె. నా పాత్ర గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. కొత్త అనుభూతిని ఇస్తుంది.

తెలుగులో సినిమా చేయడం ఎలా ఉంది?
తెలుగు ప్రేక్షకుల నుంచి నాకు లభిస్తున్న ఆదరణ అసలు ఊహించలేదు. ఒకసారి హైదరాబాద్ లో ఒక మాల్ కి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను గుర్తుపట్టి నాతో ఫోటోలు దిగడానికి రావడం చూసి ఆశ్చర్యపోయాను. షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ లభించిన స్వాగతం అసలు మరచిపోలేను. కొందరికి నా పేరు గుర్తులేకపోయినా సినిమాల్లో పోషించిన పాత్రల పేరుతో పిలుస్తూ మాట్లాడిస్తున్నారు. నేను తెలుగు ప్రేక్షకులకు ఇంతలా దగ్గర అయ్యాయని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నేను ఎన్నో తెలుగు సినిమాలు చూశాను.. కానీ తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని ఊహించలేదు. నాకు తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడం, డబ్బింగ్ సినిమాలతో నేను తెలుగు ప్రేక్షకులకు ఇంతలా చేరువయ్యాయని తెలియడం చాలా సంతోషంగా ఉంది.

ఎక్కువగా నెగటివ్ పాత్రలు చేయడానికి కారణం?
అలా అని ఏంలేదు. నా దగ్గరకు వస్తున్న పాత్రలను బట్టి ఎంచుకుంటున్నాను. నేను అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నెగటివ్ రోల్స్ లో కూడా ఏదైనా కొత్తదనం ఉంటేనే చేస్తాను. అలాగే విభిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా ఇంకా నిరూపించుకోవాలి అనుకుంటున్నాను. ఖైదీ తర్వాత ఎక్కువగా నెగటివ్ రోల్స్ వచ్చాయి. మాస్టర్ తర్వాత ఊహించనివిధంగా రొమాంటిక్ రోల్స్ వచ్చాయి. ఇలా ఒక్కో సినిమా తర్వాత ఒక్కో రకమైన పాత్రలు వస్తున్నాయి.

మీ గొంతుకి ఎందరో అభిమానులున్నారు. ఈ చిత్రానికి తెలుగు డబ్బింగ్ మీరే చెప్తున్నారా?.
అవును ఎక్కువగా నా వాయిస్ గురించి మాట్లాడుతుంటారు. అలాగే నా నటనను కూడా ఇష్టపడుతున్నారని ఆశిస్తున్నాము. బుట్టబొమ్మ కోసం మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నాను. నేను ఈ సినిమా ఒప్పుకునే ముందే నిర్మాత వంశీ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పాలని షరతు పెట్టారు.మా నిర్మాతలు సినిమాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. దర్శకుడు రమేష్ మీద నమ్మకం ఉంచి, ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Oktelugu Epaper
Exit mobile version