Rashmika Mandanna: ఎంత గ్లామర్ ఫీల్డ్ లో ఉంటున్నప్పటికీ పుబ్లిక్ లోకి వచ్చేటప్పుడు కొంచెం బట్టల సైజ్ మైండ్ లో పెట్టుకోవాలి. దారుణమైన స్కిన్ షో చేస్తే విమర్శలపాలు కాక తప్పదు. గతంలో రష్మిక రెడ్ బాడీ కాన్ డ్రెస్ ధరించి ఓ ఈవెంట్ కి హాజరైంది. బాగా కురచగా ఉన్న ఆ డ్రెస్ లో రష్మిక కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడింది. రష్మిక డ్రెస్ ట్రోల్స్ కి గురైంది. తాజాగా మరోసారి ఆమె డ్రెస్ సెన్స్ హాట్ టాపిక్ అయ్యింది. రష్మిక లేటెస్ట్ మూవీ మిషన్ మజ్ను. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించారు. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలవుతుంది. నెట్ ఫ్లిక్స్ మిషన్ మజ్ను ఓటీటీ హక్కులు కొనుగోలు చేసింది.

జనవరి 20 నుండి మిషన్ మజ్ను స్ట్రీమ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. మిషన్ మజ్ను ప్రీమియర్ షోకి రష్మిక ధరించిన డ్రెస్ జనాలను ఆకర్షించింది. ఆమె టాప్ బ్రాను తలపించింది. చాలా చిన్నగా ఒంటికి హత్తుకుపోయి ఉన్న సదరు టాప్ చూసిన నెటిజెన్స్ రష్మికను ట్రోల్ చేస్తున్నారు. కేవలం బ్రా వేసుకొని బయటకు వచ్చేశావా ఏంటి రష్మీ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.
పబ్లిక్ లో కురచ దుస్తులు ధరించి రష్మిక మరోసారి వార్తలకెక్కారు. కాగా రష్మిక నటించిన రెండో స్ట్రెయిట్ హిందీ మూవీ మిషన్ మజ్ను. గుడ్ బై ఫెయిల్ అయ్యింది. మిషన్ మజ్ను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. దాని వలన నటులకు పెద్దగా ప్రయోజనం ఉండదు. బాలీవుడ్ లో ఎదగాలని చూస్తున్న రష్మికకు ఇది పెద్ద దెబ్బే. అయితే రష్మిక చేతిలో ఓ క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్ మూవీలో రష్మిక హీరోయిన్. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

ఇక తెలుగులో పుష్ప 2 చేస్తున్నారు. సుకుమార్-అల్లు అర్జున్ ల ఈ పీరియాడిక్ క్రైమ్ డ్రామా భారీగా తెరకెక్కుతుంది. పుష్ప 2లో పుష్ప రాజ్ భార్య శ్రీవల్లిగా రష్మిక కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంలో రష్మిక పాత్ర చనిపోతుందనే ప్రచారం జరుగుతుంది. కాగా రష్మిక లేటెస్ట్ మూవీ వారసుడు థియేటర్స్ లో ఉంది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. సంక్రాంతి సినిమా కావడంతో వసూళ్లు పర్లేదు. అజిత్ తునివు కంటే రేసులో వెనుకబడిందని సమాచారం. కోలీవుడ్ సంక్రాంతి విన్నర్ అజితే అంటున్నారు.
ఇదిలా ఉంటే రష్మిక వివాదాలతో సావాసం చేస్తుంది. కన్నడ పరిశ్రమ ఆమెపై గుర్రుగా ఉంది. కాంతార దర్శకుడు రిషబ్ శెట్టి-రష్మిక మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. మరోవైపు విజయ్ దేవరకొండతో ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటుంది. తరచుగా వీరిద్దరూ వెకేషన్స్ కి చెక్కేస్తున్నారు. ఏడాది వ్యవధిలో రెండు సార్లు మాల్దీవ్స్ వెళ్లారు. విడివిడిగా ఇండియా నుండి వెళ్లి అక్కడ ఒకే హోటల్ లో మకాం వేస్తున్నారు. దీనికి ఆధారం కూడా లభించింది. రష్మిక ఆన్లైన్ వీడియో చాట్ లో ఉండగా బ్యాక్ గ్రౌండ్ లో విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది.