https://oktelugu.com/

Actress Gautami Husband: హీరోయిన్ గౌత‌మి మొద‌టి భ‌ర్త ఎవ‌రో మీకు తెలుసా.. మ‌నంద‌రికీ సుప‌రిచితుడే..!

Actress Gautami Husband: త‌మిళ స్టార్ హీరోయిన్ గౌత‌మి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పుట్టి పెరిగిన ఆమె.. త‌న పెద‌నాన్న కొడుకు నిర్మించిన ద‌యామ‌యుడు మూవీతో తెరంగేట్రం చేశారు. కాగా ఆ త‌ర్వాత మాత్రం త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. రజినీ కాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి స్టార్ హీరోయిన్ల స‌ర‌స‌న న‌టించి, అప్ప‌టికే అక్క‌డ స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న రేవ‌తి, భానుప్రియ లాంటి వారిని కూడా వెన‌క్కు నెట్టేసింది. […]

Written By:
  • Mallesh
  • , Updated On : February 17, 2022 / 12:34 PM IST
    Follow us on

    Actress Gautami Husband: త‌మిళ స్టార్ హీరోయిన్ గౌత‌మి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పుట్టి పెరిగిన ఆమె.. త‌న పెద‌నాన్న కొడుకు నిర్మించిన ద‌యామ‌యుడు మూవీతో తెరంగేట్రం చేశారు. కాగా ఆ త‌ర్వాత మాత్రం త‌మిళంలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. రజినీ కాంత్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి స్టార్ హీరోయిన్ల స‌ర‌స‌న న‌టించి, అప్ప‌టికే అక్క‌డ స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న రేవ‌తి, భానుప్రియ లాంటి వారిని కూడా వెన‌క్కు నెట్టేసింది.

    Actress Gautami and Kamal Haasan

    అయితే ఆమె వెండితెర‌కే ప‌రిచ‌యం కాకుండా.. ఇటు బుల్లితెర‌పై కూడా రాణించింది. ఇందిరా అనే పెద్ద సీరియ‌ల్ లో ఆమె లీడ్ రోల్ చేసింది. కాగా 1998లో ఆమె పెండ్లి చేసుకుంది. అయితే 1999లోనే భ‌ర్త‌తో విడాకులు తీసుకుంది. అయినా స‌రే సినిమాల్లో న‌టించ‌డం మాత్రం ఆప‌లేదు. ఇక క‌మ‌ల్ హాస‌న్‌తో ప‌రిచ‌యం కాస్తా స‌హ‌జీవ‌నానికి దారి తీసింది.

    Actress Gautami Husband Sandeep Bhatia

    ఇద్ద‌రూ క‌లిసి ప‌ర‌స్పర అంగీకారంతో 2004 నుంచి 2016వ‌ర‌కు స‌హ‌జీవ‌నం సాగించారు. ఈ గ్యాప్‌లో వీరిద్ద‌రూ కలిసి ఎన్నో సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. కాగా గౌత‌మి కొద్ది కాలం క్రితం క‌మ‌ల్ హాస‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌ను క‌మ‌ల్ హాస‌న్ శారీర‌కంగా, ఆర్థికంగా వాడుకుని వ‌దిలేశాడ‌ని, త‌న‌ను మోసం చేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ కామెంట్లు అప్ప‌ట్లో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపాయి.

    Also Read: ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ఎలా ఉందంటే.. ?

    Actress Gautami with Kamal Haasan

    కాగా 1998లో గౌత‌మి పెండ్లి చేసుకున్న భ‌ర్త మ‌నంద‌రికీ సుప‌రిచితులే. ఆయ‌నెవ‌రో కాదండోయ్‌.. భార‌తీయ ఫైనాన్షియ‌ల్ అన‌లిస్ట్ సందీప్ భాటియా. ఆయ‌న ప్ర‌తిరోజు బుల్లితెర‌పై అన‌లైసిస్ లో పాల్గొంటూనే ఉన్నారు. ఆయ‌న్ను విడిచిపెట్టి హీరో కోసం వెళ్లి చివ‌ర‌కు ఒంట‌రిగా మిగిలిపోయారు గౌత‌మి. అయితే ఆమెకు 1999లోనే సుబ్బ‌ల‌క్ష్మీ అనే కూతురు జ‌న్మించగా.. ప్ర‌స్తుతం ఆమెతో క‌లిసి ఉంటున్నారు.

    Also Read: ‘హనుమాన్’ డిజిటల్ రైట్స్ కి భారీ ధర !

    Tags