IAS Interview: ప్రస్తుతం ప్రపంచంలో బుక్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే సరిపోదు. సమయస్ఫూర్తి, పర్సనాలిటీపై కూడా నాలెడ్జ్ ఉండాల్సిందే. ఇప్పుడు చాలా పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి. ఇంతకీ రీసెంట్ గా ఓ సివిల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న గురించి తెలిస్తే ఆలోచనలో పడతారు. ఈ ప్రశ్న టాప్ ప్రశ్నల్లో ఒకటి అంటే నమ్ముతారా? మరి ఆ ప్రశ్న ఏంటి అంటే..
సివిల్ సర్వీస్ లకు ఎంపిక కావాలంటే మామూలు విషయం కాదు. ఏకంగా మూడు పరీక్షలను ఎదుర్కోవాల్సిందే. వాటిలో ప్రిలిమ్స్, మెయిన్స్ అభ్యుర్థులు అకడమిక్, జనరల్ అవేర్ నెస్ ను, విభిన్న అంశాలను పరీక్షించాలి అనుకుంటారు. ఇందు కోసం వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. అభ్యర్థి వ్యక్తిత్వం, స్వభావానికి సంబంధించిన పరీక్షనే ఈ ఇంటర్వ్యూ. సివిల్స్ ఎగ్జామ్ ఒకెత్తు అయితే ఇంటర్వ్యూ మరో ఎత్తు అనుకోవచ్చు. ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో అని చెమటలు పడుతుంటాయి కొందరికి.
ప్రతి సంవత్సరం కూడా సివిల్స్ పరీక్షకు వేలాది మంది అభ్యర్థులు హాజరవుతారు. కొంత మంది మాత్రమే ఎంపిక అవుతారు. దీనికి కారణం ఇంటర్వ్యూలో తప్పడం కూడా అవచ్చు. తర్కంతో ఆలోచిస్తే తప్ప ఈ ఇంటర్య్వూను గట్టెక్కించలేరు. ఊహించని, అనుకోని ప్రశ్నలు ఎదురవుతాయి. చివరి సారిగా జరిగిన సివిల్స్ ఇంటర్య్వూలో ఓ ప్రశ్న అడిగారు. అదేంటో ఓ సారి తెలుసుకోండి.
నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి.. కానీ ఆ అమ్మాయికి కళ్లు, చెవులు, నోరు పనిచేయవు. కానీ ఆమెను తాకకూడదు. అయినా కానీ నువ్వు ప్రపోజ్ చేయాలి. ఎలా చేస్తావు అని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రపోజ్ చేసే అబ్బాయి అంధుడు, మూగవాడు, చెవిటి వాడు కాదు కాబట్టి ఆయన ప్రపోజ్ చేయగలడు. ఇక్కడ అబ్బాయి ప్రపోజ్ ను అర్థం చేసుకోవాలి అని చెప్పలేదు కదా అని ఆ యువకుడు సమాధానం చెప్పాడు. వింటే ఈజీగానే ఉంది కానీ మీరు ఆ సమయంలో ఏం ఆన్సర్ ఇచ్చేవారో కామెంట్ చేయండి.