Abbas: పాతికేళ్ల క్రితం, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో.. హీరో అబ్బాస్ కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ముఖ్యంగా ‘ప్రేమదేశం’ సినిమా తర్వాత అబ్బాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమాలో ప్రేమికుడిగా.. ప్రియురాలి ప్రేమ కోసం పరితపించే పాత్రలో అబ్బాస్ నటన అద్భుతంగా ఉంటుంది. మెయిన్ గా అబ్బాస్ లుక్ అదుర్స్ అనిపిస్తుంది. అందుకే, అప్పట్లో యువతుల గుండెల్లో ఈ హ్యాండ్సమ్ హీరో గుబులు రేపాడు.

కానీ, ఆ తర్వాత కనుమరుగైపోయాడు అబ్బాస్. ‘ప్రేమ దేశం’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అంత పాతాళానికి పడిపోయాడు ఈ హీరో. అసలు తొలి సినిమాతోనే సంచలనం విజయం అందుకున్న అబ్బాస్ కెరీర్ ఎందుకు పతనం అయింది ? అన్నిటికీ మించి స్టార్ హీరో అయ్యాక, అబ్బాస్ పెట్రోల్ బంక్ లో ఎందుకు పని చేయాల్సి వచ్చింది ?
Also Read: ఎన్టీఆర్ డైరెక్షన్ లో బాలయ్య నటించిన గొప్ప చిత్రాలివే
లేడీస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చాక.. పైగా డ్రీం బాయ్ గా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాక, చాలా వేగంగా అబ్బాస్ తన కెరీర్ ను ఎలా కోల్పోయాడు ? ఇలాంటి అనేక ప్రశ్నలు అబ్బాస్ జీవితం వైపు తొంగిచూసేలా చేశాయి. నిజానికి అప్పట్లో తెలుగులో లెక్కలేనన్ని సినిమాలు చేశాడు అబ్బాస్. అయితే చాలా తక్కువ సమయంలోనే ఆయన కెరీర్ గ్రాఫ్ పడిపోయింది.
మంచి టాలెంట్ ఉన్నా.. ఆ తర్వాత సైడ్ హీరో పాత్రలకు, క్యారెక్టర్ ఆర్టిస్ ల పాత్రలకే ఆయన పరిమితమైపోయాడు. కారణం ఒక్కటే.. తన టాలెంట్‌ను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. డబ్బుల కోసం ఏ సినిమాలు పడితే ఆ సినిమాలు చేశాడు. అవి దారుణంగా ప్లాప్ అయ్యాయి. ఓ దశలో అబ్బాస్ సినిమాలు ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు పోయాయో అబ్బాస్ కే తెలియదు.

ఆ స్థాయికి దిగజారిపోయాడు అబ్బాస్. ఆ తర్వాత అలాంటి సినిమాలు కూడా అబ్బాస్ కి రాలేదు. మధ్యమధ్యలో తెలుగు , తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు. చివరికి నెగెటివ్ రోల్స్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ నెగిటివ్ అవకాశాలు కూడా రాలేదు. చివరకు ‘హార్పిక్’ యాడ్ లో కూడా నటించాడు.
మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో అబ్బాస్ అవకాశాలను పూర్తిగా కోల్పోయాక, ఇక బతకడం కోసం న్యూజ్ లాండ్ వెళ్ళాడు. జాబ్ దొరకలేదు. మొదట్లో న్యూజ్ లాండ్ లో పెట్రోల్ బంక్ లో కూడా పని చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత భవన నిర్మాణ పనుల కోసం కూలీకి కూడా అబ్బాస్ వెళ్ళాడు. అలా అదే ఫీల్డ్ లో అనుభవం సంపాదించి.. అబ్బాస్ అక్కడే స్థిరపడిపోయాడు.
[…] Rajasekhar: యాంగ్రీ మ్యాన్ ‘రాజశేఖర్’ ప్రస్తుతం నటిస్తున్న మూవీ… శేఖర్. ఈ సినిమా ఒక థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్టయిన ఒక క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆధారంగా ఈ ‘శేఖర్’ మూవీ రాబోతుంది. అయితే, ఈ సినిమా గురించి రాజశేఖర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. పది సినిమాల కష్టం ఒక్క ‘శేఖర్’కు అనుభవించానని హీరో రాజశేఖర్ ఎంతో ఎమోషనల్ అవుతూ అన్నాడు. […]
[…] Mikkilineni Radhakrishna Murthy: తెలుగు సినిమా నటుల్లో ఆయనది ప్రత్యేక శైలి. ఆయన పేరులోనే వ్యంగ్యం ఉంది, ఇక ఆయన మాట విరుపులోనే హాస్యం మిళితమై ఉంది. తెలుగు కళామతల్లి పాదాలకు పారాణిలా తమకంటూ ప్రత్యేక గుర్తులను మిగుల్చుకున్న మహానటుల్లో ఆయనొకరు. ఆయనే ‘మిక్కిలినేని’. అసలు పేరు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి తెలుగు రంగస్థల, సినిమా నటుడిగా, రచయితగా గొప్ప పేరు తెచ్చుకున్నారు. […]