https://oktelugu.com/

KCR Modi Fight: మోడీతో ఫైట్: చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందా?

KCR Modi Fight: ప్రత్యర్థి చాలా బలవంతుడు అయినప్పుడు ఎప్పుడూ అడుగు వేసే ముందు చాలా ఆలోచించాలి. ఆలోచించక అడుగు వేస్తే ‘చంద్రబాబు’లా బొక్క బోర్లా పడుతాడు. ప్రధానిగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ బలం, బలగం ఏంటి? ఆయన వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాడా? మోడీని ఓడించగలమా? ఇలాంటివన్నీ కూలకషంగా ఆలోచించి మరీ అడుగులు వేయాలి. 2019లో మోడీని ఓడించడానికి తన బద్ద విరోధి అయిన కాంగ్రెస్ తోనూ కలిసిన చంద్రబాబు.. దేశమంతా పర్యటించి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2022 / 11:37 AM IST
    Follow us on

    KCR Modi Fight: ప్రత్యర్థి చాలా బలవంతుడు అయినప్పుడు ఎప్పుడూ అడుగు వేసే ముందు చాలా ఆలోచించాలి. ఆలోచించక అడుగు వేస్తే ‘చంద్రబాబు’లా బొక్క బోర్లా పడుతాడు. ప్రధానిగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ బలం, బలగం ఏంటి? ఆయన వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాడా? మోడీని ఓడించగలమా? ఇలాంటివన్నీ కూలకషంగా ఆలోచించి మరీ అడుగులు వేయాలి. 2019లో మోడీని ఓడించడానికి తన బద్ద విరోధి అయిన కాంగ్రెస్ తోనూ కలిసిన చంద్రబాబు.. దేశమంతా పర్యటించి మోడీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశాడు. ఫలితం మోడీ గెలిచాడు. చంద్రబాబు ఏపీలో దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు నిండా మునిగి బీజేపీపై పల్లెత్తు మాట అనకుండా.. కలిసిన కాంగ్రెస్ కు దూరంగా బతుకీడుస్తున్నారన్న టాక్ రాజకీయవర్గాల్లో ఉంది.

    KCR Modi Fight

    చంద్రబాబు బాటలోనే ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారు. బీజేపీని, నరేంద్రమోడీపై నిప్పులు చెరుగుతున్నారు. తాజా దూషణల తీరు చూస్తే ఎవరైనా సరే.. 2019 అప్పటి చంద్రబాబులా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

    2018 వరకూ బీజేపీతోనూ, నరేంద్రమోడీ ప్రభుత్వంతోనూ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించిన చంద్రబాబు హఠాత్తుగా స్టాండ్ మార్చుకొని బీజేపీతో తెగదెంపులు చేసుకొని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ నుంచి బయటకు వచ్చారు. మోడీపై బలమైన విమర్శలతో దాడి చేయడం ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీతో సహా మహాకూటమిని ఏర్పాటు చేయడానికి బీజేపీ వ్యతిరేక శక్తులను సమీకరించడం ప్రారంభించాడు. ఆ రోజుల్లో మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రాంతీయ పార్టీలతో పెద్ద క్యాంపెయిన్ చేశారు. బీజేపీని బంగాళాఖాతంలో విసిరేయాలని పిలుపునిచ్చాడు.

    KCR Modi Fight

    కానీ చంద్రబాబు వేసిన అడుగులు తప్పు అని నిరూపితమయ్యాయి. భారీ మెజార్టీతో కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. మోడీ మళ్లీ ప్రధానమంత్రి అయ్యారు. ఇక చంద్రబాబు పరిస్థితి ఘోరంగా తయరైంది. ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోయి.. లోక్ సభలో కేవలం 3 ఎంపీ స్థానాలకు పరిమితమై చంద్రబాబుకు తీరని ఓటమిని మిగిల్చింది. చంద్రబాబు సుధీర్గ రాజకీయ ఇన్నింగ్స్ దాదాపుగా ముగింపు దశకు చేరిందన్న టాక్ నడుస్తోంది.

    ఇప్పుడు అచ్చం చంద్రబాబులాగానే కేసీఆర్ వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్ని రోజులు కేంద్రంతో, మోడీతో బలమైన బంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ తీరు మారింది. బీజేపీ పై యుద్ధాన్ని కేసీఆర్ మొదలుపెట్టారు.

    చంద్రబాబులాగానే కేసీఆర్ కూడా మోడీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ వ్యతిరేక శక్తులను సమీకరించడం ప్రారంభించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. దీంతో 2019 లో ఏపీలో చంద్రబాబు ఎదుర్కొన్న పరిస్థితినే తెలంగాణలో కేసీఆర్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో కేసీఆర్ దీన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

    Also Read: KCR Third Front: త్వ‌ర‌లోనే మ‌రో టూర్ వేస్తున్న కేసీఆర్‌.. ఈసారి కూడా ఆయ‌న్ను తీసుకెళ్తార‌ట‌

    నిజంగా మోడీపై వ్యతిరేకత ఉండి ఆయన దిగిపోతే కేసీఆర్ బలమైన జాతీయ నాయకుడిగా ఎదుగుతారు. కానీ మోడీ గెలిస్తే.. పరిస్థితి తలకిందులు అవుతుంది. తెలంగాణలో ఓడిపోతే అచ్చం చంద్రబాబు లా రెంటికి చెడ్డ రేవడి అవుతుంది.

    అయితే తెలంగాణలో బీజేపీ ఎదుగుదల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కే నష్టం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి అది టీఆర్ఎస్ కే లాభం జరుగుతుంది. తెలంగాణలో స్వతంత్రంగా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి తగినంత బలం లేదన్నది వాస్తవం. కాంగ్రెస్ కు కూడా అంతే. దీంతో టీఆర్ఎస్ కు ఈ రెండు పార్టీలు సమాన దూరంలో ఉంటాయి. దేంతోనైనా వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావచ్చు. ఎంఐఎం మద్దతు ఎలాగూ ఉంటుంది కాబట్టి కేసీఆర్ కు జాతీయ స్థాయిలో పోరాడేందుకు భయం లేదు. చంద్రబాబుకు అదే మైనస్.. కేసీఆర్ ఇదే ప్లస్.. కానీ మోడీ గెలిస్తే మాత్రం జాతీయ స్థాయిలో చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పట్టడం ఖాయం.

    Also Read: మ‌రో పాద‌యాత్ర‌కు సంజ‌య్ రెడీ.. ఎప్ప‌టి నుంచి, ఎక్క‌డి నుంచి..?

    Tags