Jabardasth Hyper Aadi: హైపర్ అది.. జబర్ధస్త్ ప్రేక్షకులకి చాలా సుపరిచితం. జబర్దస్త్ కామెడీ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు హైపర్ అది. ముఖ్యంగా యూత్ లో హైపర్ అది స్కిట్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. పైగా హైపర్ అది స్కిట్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఇటీవల హైపర్ అది ప్రేమలో పడ్డాడు అట.

గత కొన్నాళ్లుగా తనతో పాటు ఓ సినిమాలో నటిస్తున్న సహా నటిని ప్రేమిస్తున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ సుజాతతో కూడా ఆది ప్రేమలో ఉన్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో సుజాత ఓ న్యూస్ ఛానెల్ యాంకర్‌గా కూడా పని చేసింది. ఇప్పుడు ఈవెంట్స్ కూడా చేస్తుంది. అయితే కొన్ని రోజులుగా జబర్దస్త్ చేస్తూ అక్కడే బిజీగా ఉంది సుజాత.
Also Read: బీజేపీ చూపు ముద్రగడ వైపు.. పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు?
ఈ క్రమంలోనే హైపర్ అదితో పరిచయం అయ్యి.. అతనితో ప్రేమలో పడింది అట. కాగా వాలెంటైన్స్ డే నాడు స్పెషల్ గా చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో ఈ ఇద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టాలని అనుకున్నారట. అయితే, రాకింగ్ రాకేష్ సుజాతకు ఒక రింగ్ పెట్టి ప్రపోజ్ చేశాడు. ఇది ఆదిని ఏడిపించడానికి చేసిందట.

‘ఆది – సుజాత’లది నిజమైన ప్రేమ అని, త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరూ కలిసి జీవితం పంచుకుంటే కచ్చితంగా బాగుంటుంది అంటూ ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతున్నారు. అసలు ఇంతకీ ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాలి.
Also Read: గద్వాల్ రెడ్డి బిడ్డ ఎలా ఫేమస్ అయ్యాడు.. ఎలా చనిపోయాడు..?
Recommended Video:
