This Week Release Movies: మూవీ లవర్స్ కి ఈ వారం పండగే అని చెప్పొచ్చు. థియేటర్స్ లోకి వెళ్లి చూద్దాం అనుకునేవాళ్లకు , వీకెండ్ లో ఇంట్లో కూర్చొని మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకునేవాళ్లకు మంచి టైం పాస్ దొరకనుంది. వరుసగా క్రేజీ సినిమాలు మన ముందుకు రాబోతున్నాయి. ముందుగా థియేటర్స్ లో రాబోయే సినిమాల విషయానికి వస్తే , జులై ౩న భారీ బడ్జెట్ తో కొత్త హీరో విరాట్ కర్ణ ‘నాగబంధం’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు అభిషేక్ నూమా దర్శకత్వం వహించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఆడియన్స్ నుండి మంచి మార్కులు కొట్టేసింది ఈ చిత్రం, మరి థియేటర్స్ లో విడుదలయ్యాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇదే రోజున సత్య దేవ్ హీరో గా నటించిన ‘రావు బహదూర్’ చిత్రం కూడా విడుదల కాబోతుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా, ‘C/O కంచెరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వం లో తెరకెక్కించిన సినిమా ఇది. జులై 3 న విడుదల కాబోతున్న ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ వంటివి చూస్తుంటే , ఇదొక పాత్ బ్రేకింగ్ సినిమాలాగా అనిపిస్తోంది. పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే మాత్రం థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కి గూస్ బంప్స్ అనుభూతి కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే రోజున బాలీవుడ్ లో స్పై యూనివర్స్ నుండి ‘ఆల్ఫా ‘ అనే చిత్రం రాబోతుంది. అలియా భట్, శార్వరి , బాబీ డియోల్ , అనిల్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో , హృతిక్ రోషన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
మరి థియేటర్స్ లో విడుదలయ్యాక సినిమాకు కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి. ఇక ఓటీటీ లో కూడా జులై 3 న క్రేజ్ వెబ్ సిరీస్ లు , సినిమాలు వస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ లో ‘గుర్తుకొస్తున్నాయి’ అనే యూత్ ఫుల్ మూవీ, అదే విధంగా సందీప్ కిషన్ హీరో గా నటించిన ‘సూపర్ సుబ్బు’ అనే మూవీ నెట్ ఫ్లిక్స్ లో జులై 3 న విడుదల కాబోతున్నాయి. ఇక రీసెంట్ గా హాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టించిన ‘అబ్సెషన్’ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో రెంట్ రూపం లో అందుబాటులోకి రానుంది. అదే విధంగా ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్ర పోషించిన ఇసుక పట్నం అనే వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో లో రానుంది.
