https://oktelugu.com/

Heeramandi Review: ‘హీరామండి’ వెబ్ సీరీస్ రివ్యూ…

ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ ఎలా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా 'సంజయ్ ఇలా భన్సాలీ' తన మ్యాజిక్ ని సినిమాలోనే కాకుండా సిరీస్ లో కూడా రిపీట్ చేశాడా లేదా

Written By:
  • Gopi
  • , Updated On : May 2, 2024 11:12 am
    Heeramandi The Diamond Bazaar Web Series Review

    Heeramandi The Diamond Bazaar Web Series Review

    Follow us on

    Heeramandi Review: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకు ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు తీసిన సినిమాలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుతూ ఉంటాయి. ఇక ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ సినిమా మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ఉంటాడు. ఇక అలాంటి వాళ్లలో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు… ఈయన పిరియాడికల్ సినిమాలు చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇక ఈయన చేసినట్టుగా ఆ సినిమాలని ఎవరు హ్యాండిల్ చేయలేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఆయన ఓ టి టి లో హిరమండి అనే వెబ్ సిరీస్ ని చేశాడు.

    ఇంకా ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ ‘నెట్ ఫ్లిక్స్’ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సిరీస్ ఎలా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా ‘సంజయ్ ఇలా భన్సాలీ’ తన మ్యాజిక్ ని సినిమాలోనే కాకుండా సిరీస్ లో కూడా రిపీట్ చేశాడా లేదా అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ముందుగా ఈ సిరీస్ కథ విషయానికి వస్తే 1920 వ సంవత్సరంలో లాహోర్ లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొంతమంది నవాబులు ఉండేవారు. ఇక హిరమండి లో డబ్బుల కొరకు ధనవంతుల దగ్గర సెక్స్ వల్ రిలేషన్ షిప్ ను మైంటైన్ చేసే వేశ్య లకి అలవాటవుతారు. ఇక అదే సమయంలో క్విట్ ఇండియా ఉద్యమం జరగడం, అదే సమయం లో హిరమండి ప్రాంతంలో ఒక అద్భుతమైన ప్రేమ కథ సాగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఆ విషయాలకి ఈ ప్రేమ కథకి ఉన్న సంబంధం ఏంటి అనే కథాంశం తో ఈ సిరీస్ అనేది తెరకెక్కింది…మరి చివర్లో ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సీరీస్ చూడాల్సిందే….

    విశ్లేషణ

    ఇక 8 ఎపిసోడ్లు గా తెరకెక్కిన ఈ సిరీస్ ఎపిసోడ్స్ వైజ్ గా చూస్తే చాలా బోరింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఐదు ఎపిసోడ్ల వరకు అయితే స్లో నరేషన్ తో సీరియల్ ఎలాగైతే ఉందో అలాంటి సాగదీతతో ఈ సిరీస్ అనేది ముందుకు సాగింది. ఇక సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో ఉండే ఆ రిచ్ లుక్ గాని, ఆ విజువల్స్ గాని టాప్ నాచ్ లో ఉన్నప్పటికీ కథని డ్రైవ్ చేసిన విధానం మాత్రం ప్రేక్షకుడికి బోర్ కొట్టించే విధంగా ఉంది… అయితే చివరి మూడు ఎపిసోడ్లు మాత్రం సినిమాని హై లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాయి. ఆ మూడు ఏపిసోడ్లు కనుక లేకపోతే ఈ సిరీస్ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయేది. ఇక ఈ సిరీస్ ఎపిసోడ్స్ వైజ్ గా చూసుకుంటే…

    ఎపిసోడ్ 1 (ది క్వీన్ ఆఫ్ హిరమండి)

    ఇక మొదటి ఎపిసోడ్ లో మల్లిక్ జాన్ (మనీషా కోయిరాలా) అనే ఒక పవర్ ఫుల్ పాత్రని చూపించారు. ఆమె ఎలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ముందుకు సాగింది అనేది ఈ ఎపిసోడ్ లో చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారనే చెప్పాలి. అయితే పాత్రల ఇంట్రడక్షన్ కోసం ఈ మొదటి ఎపిసోడ్ ను వాడుకోవడం అనేది కొంతవరకు ఓకే అనిపించినప్పటికీ ఆడియన్స్ ను మాత్రం పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోయింది…

    ఎపిసోడ్ 2 (ఫరతాంజా ఛాలెంజేస్ రిటర్న్)

    వేశ్య ప్రేమ కథ గురించి ఈ ఎపిసోడ్ లో చాలా డీప్ గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా వాళ్లకి ఒక మనసు ఉంటుంది. వాళ్లు ఎలాంటి వాళ్లను ఇష్టపడతారు అనే పాయింట్ ను ఫోకస్ చేస్తూ ఈ ఎపిసోడ్ ముందుకు సాగుతుంది. అయితే ఈ ఎపిసోడ్ కూడా కొంతవరకు పర్లేదు అనిపించేలానే ఉంటుంది…

    ఎపిసోడ్ 3 (వహీదా జాన్)

    ఈ ఎపిసోడ్ మాత్రం చాలా స్లో నరేషన్ తో సీరియల్ కంటే ధారణంగా ముందుకు సాగుతుంది. చూసే వాడి ఓపిక కి పరీక్ష పెట్టడమే ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నట్టుగా ముందుకు సాగుతుంది. ఏ మాత్రం కాన్ఫ్లిక్ట్ అనేది లేకుండా ఎపిసోడ్ మొత్తాన్ని ముందుకు సాగించారు. ఇక ఇది చాలా వరకు బోరింగ్ ఎపిసోడ్ గా మనం చెప్పవచ్చు…

    ఎపిసోడ్ 4 (అలెంజే ప్రినోసెంట్ పాత్)

    ఇక ఈ ఎపిసోడ్ కూడా చాలా బోరింగ్ గా సాగుతూనే అసలు ఎక్కడ కూడా ప్రేక్షకుడిని ఎంగేజ్ అయితే చేయలేకపోయింది. ఇక ఈ ఎపిసోడ్ లో ఎడిటర్ తన కత్తెరకి ఇంకొంచెం పని చెప్పి ఉంటే బాగుండేదనిపిస్తుంది…

    ఎపిసోడ్ 5 (తాజ్ దార్ ది లవర్ డైలమా)

    ఇక ఈ ఎపిసోడ్ ప్రేక్షకుడిని చాలా వరకు ఎంగేజ్ చేస్తూ ముందుకు సాగింది. వేశ్య లో ప్రేమ అనేది ఎలా ఉంటుంది ఎవరెవరి మీద ఎప్పుడు ఎలాంటి ప్రేమ కలుగుతుంది అనేదాన్ని ఫోకస్ చేస్తూ ఈ ఎపిసోడ్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఇక సంజయ్ లీలా బన్సాలి మార్క్ ని కొంతవరకైతే ఈ ఎపిసోడ్ లో చూపించే విధంగా ప్రయత్నం చేశారు…

    ఎపిసోడ్ 6 (తాజ్ దార్ అండ్ అలెంజే)

    ఇక ఈ ఎపిసోడ్ లో డ్రామా గాని, డైరెక్షన్ గానీ, విజువల్స్ గాని మనకు చాలా నీట్ గా కనిపిస్తూ ఉంటాయి. సంజయ్ లీలా భన్సాలీ పెట్టిన పూర్తి ఎఫెర్ట్ మొత్తం కథపరంగా అయిన, కాన్సెప్ట్ పరంగా అయిన, డైరెక్షన్ పరంగా అయిన అన్నింటి పరంగా ఈ ఎపిసోడ్ టాప్ రేంజ్ లో ఉంటుంది…

    ఎపిసోడ్ 7 (విబుజాన్ లాంగ్ లీవ్ ది రివల్యూషన్)

    ఈ ఎపిసోడ్ లో ఒక్కొక్క క్యారెక్టర్ లో ఉన్న డ్రామాని ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ ఆర్టిస్ట్ నుంచి పూర్తి పర్ఫామెన్స్ ను రాబట్టుకోవడమే కాకుండా సిరీస్ మొత్తంలో ఈ ఎపిసోడ్ అనేది చాలా హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి…

    ఎపిసోడ్ 8 (హిరమండి ది వ్యామ్ సాంగ్)

    ఇక ఈ ఎపిసోడ్ లో స్వాతంత్రం వచ్చినట్టుగా చూపించారు. దానికి తోడుగా “స్వాతంత్ర్యం వచ్చిన వేశ్యల పోరాటం ఇంకా ఆగడం లేదు, అలాగే మహిళల పోరాటం కూడా ముగియలేదు” అనే పాయింట్ ని రైజ్ చేస్తూ సెకండ్ సీజన్ ఉంటుంది అనేలా హింట్ ఇచ్చారు.

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    మల్లికా జాన్ గా నటించిన మనిషా కొయిరాలా మాత్రం ఈ సినిమాని తన భుజాల మీద మోసుకెళ్లిందనే చెప్పాలి. ఆమె క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉండటమే కాకుండా ఆమె చూపించిన హావభావాలు కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి. ఇక సోనాక్షి సిన్హా తన పరిధి మేరకు ఓకే అనిపించింది. అలాగే అనూజ్ శర్మ ఒక డీసెంట్ రోల్లో పర్ఫార్మ్ చేయడమే కాకుండా ఇంతకుముందు తను చేయని వైవిధ్యమైన నటనను కనబరిచి కథకి ఎలాంటి నటన అయితే కావాలో అలాంటి పాత్రలో చేసి జీవించాడనే చెప్పాలి…ఇక మిగిలిన వాళ్ళు వాళ్ళ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికొస్తే ఈ సిరీస్ లోని విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి… అలాగే మ్యూజిక్ కూడా బావుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల కొన్ని సీన్లు ఎమోషనల్ గా చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా లాస్ట్ 3 ఎపిసోడ్స్ లో అయితే ఎమోషన్ బాగా వర్కవుట్ అవ్వడానికి బిజియం చాలా వరకు హెల్ప్ అయింది…ఎడిటర్ ఇంకొంచెం షార్ప్ ఎడిట్ చేస్తే బాగుడేది…

    ప్లస్ పాయింట్స్

    కథ
    విజువల్స్
    యాక్టర్స్

    మైనస్ పాయింట్స్

    కొన్ని ఎపిసోడ్స్ స్లో నరేషన్ లో నడిచాయి…

    కొన్ని సీన్లలో డైరెక్షన్ మైనస్ అయింది…

    రేటింగ్

    ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.25/5