https://oktelugu.com/

Maruthi Swift 2024: మే9న 2024 స్విప్ట్ రిలీజ్.. బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎలా ఉందంటే?

2024 మారుతి స్విప్ట్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉందని తెలుస్తోంది. కా

Written By:
  • Srinivas
  • , Updated On : May 2, 2024 / 11:37 AM IST

    Maruthi Swift 2024

    Follow us on

    Maruthi Swift 2024: మారుతి కార్లు అంటే ఎవరికైనా క్రేజే. ఈ కంపెనీ నుంచి వచ్చిన వివిధ మోడళ్లు వినియోగదారులను ఎంతో ఆకర్షించాయి. వీటిలో స్విప్ట్ ఒకటి. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో వచ్చిన ఈ కారు మార్కెట్లోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆదరణ పొందుతోంది. అయితే ఈ స్విప్ట్ ను నేటి యువతకు అందించే విధంగా ఆధునిక ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇది మే 9న మార్కెట్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ కారు కోసం ఇప్పటికే బుకింగ్ ప్రారంబమయ్యాయి. రూ.1100 టోకెన్ తో కారు కొనేందుకు బుకింగ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఆ కారు ఎలా ఉండబోతుందంటే?

    2024 మారుతి స్విప్ట్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉందని తెలుస్తోంది. కానీ రిలీజ్ అయితే గానీ చెప్పలేమని అంటున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్, సిట్రియోన్ సీ 3 లకు కొత్త స్విప్ట్ గట్టి పోటీ ఇవ్వనుంది.

    కొత్త స్విప్ట్ లో అప్డేట్ ఫీచర్స్ అమర్చారు. 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డ్యాష్ బోర్డు ఆకర్షణీయంగా ఉంటుంది. పాత దాని కంటే కొత్ స్విప్ట్ లో ఇంటీరియర్ లో కొన్ని మార్పులు చేశారు. ఇక సేప్టీ విషయానికొస్తే ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా కూడా ఉండే అవకాశం ఉంది.

    ఈ మోడల్ ధర విషయానికొస్తే ఎక్స్ షోరూం ధర రూ.6.24 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 8.83 లక్షల వరకు విక్రయించనున్నారు. పాత స్విప్ట్ కంటే ఇందులో ఫీచర్స్ ఆకట్టుకోనున్నాయి. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో రిలీజ్ అవుతున్నప్పటికీ ఎస్ యూవీ రేంజ్ లో సౌకర్యాలను కలిగిస్తుందని ఆటోమోబైల్ రంగంలో చర్చ సాగుతోంది.