Junior full movie review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త కథలతో యంగ్ హీరోలు సాహసాలను చేస్తూ మంచి విజయాలను సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది కొత్త హీరోలు సైతం మంచి స్టోరీస్ తో సినిమాలు చేసి తమకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకొని ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ప్రముఖ బిజినెస్ మెన్ అయిన గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి (Kiriti) హీరోగా పరిచయమైన జూనియర్(Junior) సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే అభి (Kiriti) చాలా జోవియల్ గా ఉంటూ మనిషి జీవితంలో సాధించేది ఏమీ లేదు చివరి స్టేజ్లో ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటే మనకంటూ కొన్ని సంతోషాలు, సరదాలు ఉండాలి అనే ఉద్దేశ్యంతో తన ఎంటైర్ లైఫ్ ను గడపాలని చూస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కాలేజీ లైఫ్ అంతా సరదాగా సాగిపోవాలని చాలా ఫన్నీగా ఉంటూ సరదా సరదాగా గడుపుతూ ఉంటాడు…ఇక ఇలాంటి క్రమంలోనే స్ఫూర్తి (Srileela) తనకు పరిచయం అవుతుంది…తనతో ప్రేమ వ్యవహారాలను నడుపుతూ కాలేజీ జీవితాన్ని సాఫీగా సాగిస్తూ ఉంటాడు.
మరి ఇలాంటి క్రమంలోనే తన కాలేజీ లైఫ్ అయిపోయి కంపెనీలో జాబ్ కి చేరుతాడు. అక్కడ సీఈఓ గా ఉన్న విజయ సౌజన్య (geniliya) కి అభి అంటే అస్సలు పడదు. ఇక తను విజయనగరం నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఊరు అంటే కూడా తనకు అసలు నచ్చదు…ఈ క్రమంలోనే ఒక ప్రాజెక్టు వర్క్ మీద విజయ సౌజన్య, అభి ఇద్దరు కలిసి విజయనగరం వెళ్లాల్సి వస్తోంది. అక్కడ ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇంతకీ విజయనగరానికి ఆమెకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
Also Read: Genelia viral video: జెనీలియా కాళ్లకు మొక్కిన యంగ్ హీరో.. వీడియో వైరల్!
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని దర్శకుడు ఫ్యామిలీ డ్రామాగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇక అక్కడక్కడ హాస్య సన్నివేశాలు ఉన్నప్పటికి వాటిలో కామెడీ డోస్ అనేది కొంతవరకు తగ్గిందనే చెప్పాలి… తను ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నాడో అ పాయింట్ ను స్ట్రైయిట్ గా చెప్పకుండా వివిధ రకాల కోణాల్లో తిప్పుతూ చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. మరి మొత్తానికైతే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్టాఫ్ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ముందుకు దూసుకెళ్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలకు మంచి స్కోప్ ఉన్నప్పటికి దర్శకుడు వాటిని పూర్తిగా వాడుకోలేకపోయాడు. వాటిని కనక పర్ఫెక్ట్ గా సెట్ చేసి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేది…అయితే సినిమా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే బాగుంది…ఇంక సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కూడా ప్రేక్షకుడు కొంత వరకు అసంతృప్తితో అయితే బయటికి వస్తాడు. ఎందుకంటే సినిమాలో ఏదో మిస్సయిన అనుభవం ప్రతి ప్రేక్షకుడికి కలుగుతూ ఉంటుంది…
ఇంకా కొన్ని సన్నివేశాలు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా హెల్ప్ అయింది. ఇక ‘వైరల్ వయ్యారి’ అనే సాంగ్ కూడా సినిమా ప్రమోషన్స్ కి బాగా ఉపయోగపడింది. అలాగే థియేటర్లో కూడా ఈ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఈ సాంగ్ అందరికి బాగా కనెక్ట్ అయిపోయింది…ఇక దర్శకుడు కి పెద్దగా అనుభవం లేని విషయం సెకండాఫ్ లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడక్కడ తడబడ్డట్టుగా తెలుస్తోంది. కథ బాగున్నప్పటికి దానిని స్క్రీన్ మీద మాత్రం అంత ఎఫెక్ట్ గా ప్రజెంట్ చేయలేకపోయారు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే కిరీటి కి ఇది మొదటి సినిమా అయినప్పటికి చాలా కాన్ఫిడెంట్ గా డ్యాన్స్ లు వేశాడు. ఇక నటన పరంగా చూసుకుంటే ఆయన అక్కడక్కడ కొంతవరకు తడబడ్డప్పటికి కొన్ని మేజర్ సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు. ఇక కిరీటి కంటిన్యూస్ గా సినిమాలను చేసుకుంటు హీరోగా కొనసాగితే మాత్రం నటనలో ఇంకొంచెం మెలకువలు నేర్చుకొని ముందుకు సాగితే మంచిది… శ్రీలీల క్యారెక్టర్ పెద్దగా సినిమాలో అయితే ఏమి లేదు. తను ఓన్లీ సాంగ్స్ మాత్రమే పరిమితమైందని చెప్పాలి.
Also Read: Naresh Pavithra bedroom: నరేష్, పవిత్ర బెడ్ రూమ్ లో మురళీ మోహన్..సంచలన వీడియో!
జెనీలియా కు చాలా మంచి స్కోప్ ఉన్న పాత్ర అయితే దొరికింది. తెలుగులో చాలా సంవత్సరాల తర్వాత ఈ ముద్దుగుమ్మ తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. అయితే తన పాత్రను ఇంకాస్త వాడుకొని ఉంటే బాగుండేది… రావు రమేష్, రవిచంద్రన్ వంటి నటులు సైతం సినిమాని ఎమోషనల్ గా మలిచే ప్రయత్నం అయితే చేశారు… ఇక మిగతా ఆర్టిస్టులందరు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీప్రసాద్ ఒకటి రెండు సాంగ్స్ ని బాగా ఇచ్చాడు. ముఖ్యంగా వైరల్ వయ్యారి సాంగ్ అయితే సినిమా రిలీజ్ కి ముందే చాలా బాగా వైరల్ అయింది. దానివల్ల సినిమాకి ప్రమోషనల్ గా బాగా హెల్ప్ అయిందనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా దేవి చాలావరకు కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది… సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ వర్క్ సినిమాకి బాగా హెల్ప్ అయింది… ప్రత్యేకంగా ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలకు ఆయన అందించిన సినిమాటోగ్రఫీ చాలావరకు సినిమాని ఎంగేజింగ్ గా తీసుకెళ్లింది…
ప్లస్ పాయింట్
1. కథ
2. ఫస్టాఫ్
3. క్లైమాక్స్ ట్విస్ట్
మైనస్ పాయింట్స్
1. సెకండాఫ్
2. ఎమోషనల్ సీన్స్
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్: 2.25/5