https://oktelugu.com/

ఆయనకే హిట్ లేదు.. ఆయనేం హిట్ ఇస్తాడు !

అందరి హీరోలది ఒక బాధ అయితే, యాక్షన్ హీరో గోపీచంద్ ది ఒక బాధ. పాపం మొదటి నుండి గోపిచంద్ కి ఒక హిట్ వచ్చిందంటే.. ఆ తరువాత వెంటనే వరుసగా నాలుగు ప్లాప్ లు రావడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే ఈ ఆనవాయితీని బ్రేక్ చేయడానికి ముందుకు వచ్చాడు సంపంత్ నంది. నిజానికి సంపత్‌ నందికే హిట్ లేదు, ఇక ఆయన గోపిచంద్ కి ఏం హిట్ ఇస్తాడు అని మనం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 30, 2020 / 02:12 PM IST
    Follow us on


    అందరి హీరోలది ఒక బాధ అయితే,
    యాక్షన్ హీరో గోపీచంద్ ది ఒక బాధ. పాపం మొదటి నుండి గోపిచంద్ కి
    ఒక హిట్ వచ్చిందంటే.. ఆ తరువాత వెంటనే వరుసగా నాలుగు ప్లాప్ లు రావడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే ఈ ఆనవాయితీని బ్రేక్ చేయడానికి ముందుకు వచ్చాడు సంపంత్ నంది. నిజానికి సంపత్‌ నందికే హిట్ లేదు, ఇక ఆయన గోపిచంద్ కి ఏం హిట్ ఇస్తాడు అని మనం అనుకోవచ్చు. కానీ హిట్ ఇస్తా అని నమ్మకంగా చెబుతున్నాడు సంపత్. అందుకే ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో ఓ కామెడీ రోల్ ను అద్భుతంగా డిజైన్ చేశాడట. కేవలం కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారట.

    Also Read: ఎవరయ్యా అతన్ని పిలిచింది..!

    ఇంతకీ ఆ కామెడీ పాత్రలో ఎవరు నటిస్తున్నారు అంటే.. కామెడీ కింగ్ బ్రహ్మానందం. ఆ పాత్రలో ఈ సీనియర్ కమెడియన్ నటిస్తున్నాడని తెలుస్తోంది. బ్రహ్మానందంకు ఈ మధ్య అసలు సినిమాలే లేవు. చాల కాలం తరువాత బ్రహ్మానందంకి మంచి కామెడీ క్యారెక్టర్ దొరికిందనే చెప్పాలి. మరి బ్రహ్మానందంకి ఈ సినిమాతో దశ తిరుగుతుందేమో చూడాలి. ఒకవేళ బ్రహ్మానందంకు ఈ సినిమాతో మళ్లీ హిట్ వచ్చినా వయసు రిత్యా ఆయన ఇక ఎక్కువ సినిమాలు చేస్తాడని అనుకోలేం. ఇక గత కొన్ని సినిమాలుగా హిట్ కోసం గోపీచంద్‌ చేయని ప్రయత్నం లేదు. అయినా హిట్ వచ్చిన పాపాన పోలేదు.

    Also Read: ఆర్ఆర్ఆర్ ‘సీత’ పెళ్లికి ముస్తాబైంది !

    పాపం ఇలాంటి ప్లాప్ ల పరిస్థితిలో కూడా యాక్షన్ హీరోగా కొనసాగడానికి గోపీచంద్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గోపీచంద్ చేస్తోన్న ఈ యాక్షన్ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కి కోచ్‌గా చేస్తున్నాడు. అలాగే తమన్నా కూడా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌ గా కనిపించబోతుంది. అయితే వీరి మధ్య నడిచే లవ్ ట్రాక్ కూడా చాల ఆసక్తికరంగా ఉంటుందని.. అలాగే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా హైలెట్ చేయడానికి సంపత్ నంది బాగానే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్