https://oktelugu.com/

రైలు ప్రయాణికులకు శుభవార్త.. విమానాన్ని తలపించేలా రైలు బోగీలు..?

మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్లడానికి రైళ్ల ద్వారా ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతారు. కరోనా నిబంధనలు, లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. అయితే మన దేశంలోని రైళ్లు అన్నీ దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. అయితే రైల్వే శాఖ భవిష్యత్తులో మాత్రం విమానాలను తలపించే విధంగా రైలు బోగీలలో, రైళ్లలోని సీట్లలో మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. Also Read: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 30, 2020 / 02:34 PM IST
    Follow us on


    మన దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు దూర ప్రాంతాలకు వెళ్లడానికి రైళ్ల ద్వారా ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతారు. కరోనా నిబంధనలు, లాక్ డౌన్ వల్ల దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. అయితే మన దేశంలోని రైళ్లు అన్నీ దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. అయితే రైల్వే శాఖ భవిష్యత్తులో మాత్రం విమానాలను తలపించే విధంగా రైలు బోగీలలో, రైళ్లలోని సీట్లలో మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది.

    Also Read: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. వెలుగులోకి కొత్తరకం మోసం..!

    ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశంలోని రైళ్లలో హైజెనిటీ తక్కువని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. అయితే మన రైల్వే వ్యవస్థను అద్భుతంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశంలో దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు రైల్వే శాఖలో పని చేస్తుండగా 13,000కు పైగా రైళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లలో సౌకర్యాలు గొప్పగా లేకపోయినా మరి కొన్నేళ్లలో ప్రజలకు అందుబాటులోకి రాబోయే రైళ్లలో మాత్రం ఊహించని విధంగా ఎన్నో సదుపాయాలను కల్పించారు.

    రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ రైలు బోగీలకు సంబంధించిన ఒక వీడియోను షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రయాణాన్ని మైళ్లలో కాకుండా జ్ఞాపకాలతో కొలవాలంటూ పీయూష్ గోయల్ రైలు బోగీ, సీట్లకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. పీయూష్ ఈ రైలు బోగీలలో ప్రయాణిస్తే మరిచిపోలేని ప్రయాణ అనుభవాన్ని పొందుతామని వెల్లడించారు. ఈ రైలు బోగీలను విస్తాడిమ్ బోగీలు అని అని పిలుస్తారు.

    Also Read: జనవరి 7 వరకు బ్రిటన్‌ ఫ్లైట్లు బంద్

    ఈ బోగీలలో సీట్ల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండటంతో పాటు సీట్లు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. సీటు ఫేసింగ్ ను కూడా మార్చుకునే సదుపాయం ఉండటం గమనార్హం. క్లోజుడ్ సర్క్యూట్ కెమెరాలు కూడా ఈ రైళ్లలో ఉండటం గమనార్హం. అయితే ప్రయాణికులకు ఈ రైళ్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో చూడాల్సి ఉంది.

    మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం