https://oktelugu.com/

బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. వెలుగులోకి కొత్తరకం మోసం..!

దేశంలో ఒక మోసం వెలుగులోకి వచ్చేసరికి మరో కొత్తమోసం చేస్తూ మోసగాళ్లు అమాయకపు ప్రజల బ్యాంకు ఖాతాలలోని డబ్బులను దోచేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తాజాగా మరో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆధార్ కార్డ్ ఉన్నవారిని టార్గెట్ చేసి మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఆధార్ కార్డ్ నంబర్, వేలిముద్రల ఫోటో వివరాల ద్వారా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోసగాళ్లు చేస్తున్న కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. Also Read: రైలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 30, 2020 / 02:09 PM IST
    Follow us on


    దేశంలో ఒక మోసం వెలుగులోకి వచ్చేసరికి మరో కొత్తమోసం చేస్తూ మోసగాళ్లు అమాయకపు ప్రజల బ్యాంకు ఖాతాలలోని డబ్బులను దోచేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తాజాగా మరో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆధార్ కార్డ్ ఉన్నవారిని టార్గెట్ చేసి మోసగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం. ఆధార్ కార్డ్ నంబర్, వేలిముద్రల ఫోటో వివరాల ద్వారా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోసగాళ్లు చేస్తున్న కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది.

    Also Read: రైలు ప్రయాణికులకు శుభవార్త.. విమానాన్ని తలపించేలా రైలు బోగీలు..?

    నిందితులు ఏపీ రెవిన్యూ వెబ్ సైట్ నుంచి దస్తావేజులను డౌన్ లోడ్ చేసుకుని ఆ వివరాల ద్వారా హైదరాబాద్ లో నివశిస్తున్న సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి బ్యాంక్ ఖాతాలోని 10,000 రూపాయలు విత్ డ్రా చేశారు. నిందితులు పేపాయింట్ ద్వారా ఆధార్ నంబర్, వేలిముద్రల వివరాలతో డబ్బును బ్యాంక్ అకౌంట్ నుంచి ఖాళీ చేసినట్లు సమాచారం. బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు మాయం కావడంతో సత్యనారాయణ మూర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

    Also Read: ఈ స్మార్ట్ బ్యాండ్ తో అనారోగ్య సమస్యలకు చెక్.. ఎలా అంటే..?

    సీఏ విద్యార్థులు అర్షద్, విశాల్ ఈ మోసానికి పాల్పడినట్టు తెలుస్తోంది. వేలిముద్రల ఫోటోల ద్వారా కూడా మోసాలు జరుగుతుండటంతో ప్రజలు బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. సైబర్ మోసగాళ్లు రూటు మారుస్తూ కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూ ఉండటంతో చాలామంది అమాయకుల బ్యాంకు ఖాతాలలోని డబ్బులు మాయమవుతున్నాయి.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఇప్పటివరకు కాల్స్ ద్వారా, ఏటీఎం వివరాలను సేకరించడం ద్వారా మోసాలకు పాల్పడిన వాళ్లు వేలిముద్రల సహాయంతో మోసాలకు పాల్పడుతూ ఉండటంతో బ్యాంకులు సైతం కస్టమర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ లావాదేవీల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది.