HBD Pawan Kalyan: దయగల దేవుడు.. ప్రజల కోసం వచ్చిన మహానుభావుడు.. ఆయన కోపం, సహనం ప్రజల కోసం.. ఈశ్వరా.. పవనీశ్వరా.. పవరీశ్వరా.. సగటు పవన్ అభిమానులు ఆయన విషయంలో వ్యక్తం చేసే అభిప్రాయం ఇది. తొలుత కళ్యాణ్ బాబుగా.. తరువాత పవన్ కళ్యాణ్ గా.. తరువాత పవర్ స్టార్ గా.. అటు తరువాత జనసేన అధినేతగా.. ఏపీ డిప్యూటీ సీఎం గా.. పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఒక ప్రభంజనమే. చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాడో అని ఎదురు చూశారు. కానీ ఇలా ఉన్నాడు ఏంటి అని అనుకున్నారు. స్టార్ హీరో తమ్ముడు కదా అంటూ తేలిగ్గా తీసుకున్నారు. కానీ చిరంజీవి తమ్ముడు అనే ట్యాగ్ లైన్ నుంచి బయటకు రావడానికి పవన్ కళ్యాణ్ కు ఎంతో టైం పట్టలేదు. తనకంటూ ఒక మేనరిజంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ ది. అద్భుతమైన నటుడు కాదు.. అంతకుమించి డాన్సర్ కాదు.. కానీ ఆయనలో ఏదో ఉంది. అదే ఆకర్షణ. సమాజాన్ని ప్రభావితం చేసే ప్రవర్తన. వరుసగా నాలుగు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి తనకంటూ ఒక ముద్ర చాటుకున్నాడు. మధ్యలో సరైన హిట్లు పడడానికి 11 ఏళ్లు పట్టింది. అయినా సరే ఆయనకు ఉన్న స్టార్ డం చెక్కుచెదరలేదు. తిరిగి గబ్బర్ సింగ్ తో బెబ్బులిలా అమాంతం పైకి లేచాడు పవన్.
Also Read: ఓజీ’ క్లైమాక్స్ కి ఆడియన్స్ కన్నీళ్లు ఆపుకోలేరా..? సుజిత్ రిస్క్ చేస్తున్నాడా!
* తెలుగు చిత్ర పరిశ్రమలు బలమైన ఉనికి..
చేసిన సినిమాలు తక్కువే అయినా పవన్ కళ్యాణ్ ( deputy CM Pawan Kalyan) తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. అయితే రాజకీయాల్లో సైతం ఒకేసారి ఎదగలేదు పవన్. ఎన్నెన్నో కష్టాలను అధిగమించి.. విమర్శకులకు సైతం మెప్పించి.. రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడి నుంచి.. ఈ రాష్ట్రం గర్వించేలా శత శాతం విజయం సాధించి.. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటూ ఒక గుర్తింపు పొందారు పవన్ కళ్యాణ్. సినిమాల్లోకి అన్నయ్య చిరంజీవి చేతిని పట్టుకొని వచ్చి.. అదే అన్నయ్య క్రేజ్ ని మించిన నటుడుగా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండడం పవన్ కళ్యాణ్ కు ఉన్న ఉత్తమ లక్షణం.
* ఎంతో పరిణితితో
సినిమాల్లో చూడాల్సిన ప్రజాభిమానం తక్కువ కాలంలోనే చూసేసాడు పవన్ కళ్యాణ్. సాధించాల్సిన ప్రజాభిమానం అంతా సాధించేశాడు. ప్రజలకు ఏదో చేయాలని కసి ఉండేది. అది ప్రజారాజ్యం( Praja Rajyam party ) పార్టీలోనే పవన్ లో కనిపించింది. కానీ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం తట్టుకోలేకపోయారు పవన్. అందుకే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రకటించారు. దానినే జనసేన గా మార్చి.. జనం గుండె చప్పుడుగా మార్చాలని భావించారు. కానీ జనంలోకి జనసేన వెళ్లేందుకు చాలా సమయం పట్టింది.
* లైట్ తీసుకున్న ప్రజలు..
పవన్ రాజకీయాల్లోకి ప్రవేశించి.. జనసేన( janasena ) ఏర్పాటు చేసినప్పుడు.. మెగాస్టార్ చిరంజీవి ఏం చేయలేకపోయాడు.. ఈయన ఏం చేస్తాడులే అంటూ ప్రతి ఒక్కరూ తేలిగ్గా తీసుకున్నారు. రాజకీయాల్లోకి వస్తూ వస్తూ రాష్ట్ర పరిస్థితులను పరిగణలోకి తీసుకొని సీనియారిటీని గుర్తించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసి ఓడిపోయారు. తాను రెండుచోట్ల పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఈ పరిస్థితుల్లో ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా జనసేన మూత తప్పదని అంతా భావించారు. కానీ అక్కడే పవన్ ఇంతింతై.. వటుడింతై అన్నట్టు పైకి లేచారు. పిడికిలి బిగించి.. వైసిపి ప్రభుత్వం పై సమరభేరి మోగించారు. జనాల్లో తిరిగారు.. జనాల్లోనే తిన్నారు.. జనాల్లోనే నిదురించారు. అలా టిడిపి తో కూటమి కట్టి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగారు. రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పటివరకు డిప్యూటీ సీఎం పదవి అంటే హోదా మాత్రమే.. కానీ పవన్ దానిని ఒక బాధ్యతగా గుర్తించి మసులుకుంటున్నారు. దటీజ్ పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులు సైతం అనేలా వ్యవహరిస్తున్నారు.