https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ 8′ నుండి గంగవ్వ అవుట్..6 వారాలకు ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

ఈ సీజన్ లో సెల్ఫ్ ఎలిమినేట్ అయిన రెండవ కంటెస్టెంట్ గా గంగవ్వ నిల్చింది. ఈమె ఎలిమినేట్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు. ఎందుకంటే ఈమెని వయస్సులో పెద్దావిడ కాబట్టి, నామినేషన్ వేయడానికి ఏ కంటెస్టెంట్ సాహసం చేయడం లేదు.

Written By:
  • Vicky
  • , Updated On : November 9, 2024 / 09:13 PM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  ఈ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన వారిలో ఇప్పటికే మెహబూబ్, నయనీ పావని ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం రేపటి ఎపిసోడ్ లో గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వబోతుందట. ఆమెకి గత వారం నుండి ఆరోగ్యం బాగలేకపోవడం తో ఈ వారం నామినేషన్స్ లోకి రాకపోయినా కూడా తనకి తాను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యిందట. మణికంఠ తర్వాత ఈ సీజన్ లో సెల్ఫ్ ఎలిమినేట్ అయిన రెండవ కంటెస్టెంట్ గా గంగవ్వ నిల్చింది. ఈమె ఎలిమినేట్ అవ్వాలని చాలా మంది కోరుకున్నారు. ఎందుకంటే ఈమెని వయస్సులో పెద్దావిడ కాబట్టి, నామినేషన్ వేయడానికి ఏ కంటెస్టెంట్ సాహసం చేయడం లేదు. ఆమె కూడా దయచేసి నన్ను 10వ వారం వరకు నామినేట్ చెయ్యొద్దు అంటూ హౌస్ మేట్స్ ని రిక్వెస్ట్ చేసుకుంది.

    పోనీ ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఇస్తుందా అంటే అది కూడా లేదు. ఒక్క దెయ్యం ప్రాంక్ తప్ప గంగవ్వ చేసిందేమి లేదు. హౌస్ లో మణికంఠ తాను గేమ్స్ ఆడలేకపోతున్నానని, తాను హౌస్ లోనే ఉంటే ఆడే కంటెస్టెంట్స్ కి న్యాయం జరగదని స్వచ్చందంగా బిగ్ బాస్ హౌస్ నుండి తప్పుకున్నాడు. గంగవ్వ కూడా అలా గత రెండు వారాల్లోనే ఎదో ఒక వారం లో చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఆమె కంటే బాగా మెహబూబ్, నయనీ పావని ఆడగలరు. హౌస్ లో ఏ పని చేయకుండా, టాస్కులు ఆడకుండా అక్కడ ఉండి ఏమి ప్రయోజనం. గంగవ్వ పెద్ద మనసు చేసుకొని ముందుగానే సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యుంటే, నేడు బాగా గేమ్స్ ఆడే మెహబూబ్, నయనీ పావని ఉండేవాళ్ళు. ఇప్పటికైనా గంగవ్వ బయటకి వెళ్లిపోవాలని మంచి నిర్ణయమే తీసుకుంది. లేకపోతే మంచి టీఆర్ఫీ కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఎలిమినేట్ అయ్యేవాళ్ళు.

    ఇదంతా పక్కన పెడితే గంగవ్వ బిగ్ బాస్ లోకి రాకముందే మంచి ఫేమస్ పర్సనాలిటీ. సోషల్ మీడియా ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి గంగవ్వ తెలియకుండా ఉండదు. ‘మై విలేజ్’ షో ద్వారా ఆమె సంపాదించిన పాపులారిటీ అలాంటిది మరి. సీజన్ 4 లో వచ్చినప్పుడు ఆమెకి వారానికి రెండు లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఇప్పుడు సీజన్ 8 లో ఆమెకి వారానికి 3 లక్షలు ఇచ్చినట్టు సమాచారం. హౌస్ లో ఆమె ఆరు వారాలు కొనసాగింది. ఈ ఆరు వారాలకు గాను ఆమె 18 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంది అన్నమాట. హౌస్ లో ప్రస్తుతం ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్ కంటే గంగవ్వ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంది. బిగ్ బాస్ ఆమె మీద అభిమానంతో ఊరికే ఇచ్చినట్టు గా ఉంది. ఏది ఏమైనా గంగవ్వ ఎలిమినేషన్ తో యష్మీ, పృథ్వీ సేవ్ అయిపోయారు.