https://oktelugu.com/

భయమేస్తోందన్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, సమీకృత కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాయాలను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట అండగా ఉందని గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలోనే పుట్టిపెరిగానని, తాను పుట్టిన చోటే కలెక్టరేట్ సముదాయాల ప్రారంభం సంతోషంగా ఉందన్నారు. గతంలో తాగునీటి కోసం జిల్లా ప్రజలు ఎంతో అల్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో బావులను, బోర్లను అద్దెకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 20, 2021 / 07:32 PM IST
    Follow us on

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్, సమీకృత కలెక్టరేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాయాలను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట అండగా ఉందని గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలోనే పుట్టిపెరిగానని, తాను పుట్టిన చోటే కలెక్టరేట్ సముదాయాల ప్రారంభం సంతోషంగా ఉందన్నారు. గతంలో తాగునీటి కోసం జిల్లా ప్రజలు ఎంతో అల్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
    ఆ రోజుల్లో బావులను, బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్లతో నీటిని అందించిన విధానాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయని చెప్పారు. పాలనాసంస్కరణల్లో భాగంగానే 33 జిల్లాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పాలనా ఫలాలు ప్రజలకు నేరుగా అందేందుకు సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. తొలి ప్రాధాన్యతగా విద్యుత్ సమస్యను పరిష్కరించామన్నారు. రాష్ర్టంలో మంచినీటి సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ చేపట్టామని వివరించారు.
    తెలంగాణలో మొత్తం 2.75 కోట్ల ఎకరాల భూమి ఉందన్నారు. 1.65 కోట్ల ఎకరాల భూమి రైతుల ఆధీనంలో ఉందని చెప్పారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఓ రైతు వేదిక ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాస్ర్తవేత్తలు, నిపుణుల సలహాలు, సూచనలతో సంస్కరణలు చేపట్టామని సూచించారు. రైతుల అవసరాలు తీర్చేందుకు రైతుబంధు ప్రారంభించామన్నారు. అవినీతిని అరికట్టేందుకు రైతుల ఖాతాల్లో నేరుగా రైతు బంధు డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
    తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని కేసీఆర్ స్పష్టం చేశారు. భూసమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశామని పేర్కొన్నారు.  రైతుల సంక్షేమమే ప్రధానంగా ముందుకు వెళతామని చెప్పారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు.