Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మనకి చాలా క్యూట్ గా అనిపిస్తున్న రిలేషన్స్ లో ఒకటి నిఖిల్ – మణికంఠ స్నేహం. మొదటి మూడు వారాలు వీళ్లిద్దరు చాలా క్లోజ్ గా ఉండేవారు. కానీ ఆ తర్వాత మణికంఠ షేడ్స్ ని చూసి షాక్ కి గురైన నిఖిల్ అతన్ని దూరంగా పెట్టడం మొదలు పెట్టాడు. కానీ వీళ్లిద్దరు స్నేహం గా ఉన్నన్ని రోజులు వీళ్ళ మధ్య వచ్చే జోక్స్ చాలా సహజంగా ఉండేవి. వాళ్ళు మాట్లాడుకునే తీరుని చూసి మనం మన స్నేహితులతో మాట్లాడే క్షణాలను గుర్తు చేసుకోవచ్చు. అంత క్యూట్ గా ఉంటుంది. అయితే చేతులారా మణికంఠ నే ఈ బంధాన్ని నాశనం చేసుకున్నాడు. సోనియా హౌస్ లో ఉన్న చివరి వారం లో, చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశాన్ని తనకి తానుగా త్యాగం చేస్తాడు మణికంఠ.
అవతల క్లాన్ వాళ్ళు పాపం ప్రతీసారి మణికంఠ నే తీసేస్తున్నారు, ఇది అన్యాయం అని చర్చించుకోవడం మనమంతా చూసాము. వాళ్ళు మణికంఠ ని ఎందుకు తీశారు అని అడగగా, నిఖిల్ వాడే త్యాగం చేసాడు అని బదులిస్తాడు. దీనికి మణికంఠ నేను అలా చేయలేదు అని అబద్దం ఆడుతాడు. ఈ సంఘటన నిఖిల్ కి మైండ్ బ్లాక్ అయ్యేంత పని చేసింది. అందుకే మరుసటి వారంలో నిఖిల్ మణికంఠ ని నామినేట్ చేసి, అతనితో ఉన్న ఆ స్నేహాన్ని పూర్తిగా కట్ చేసుకుంటాడు. అప్పటి నుండి మణికంఠ కి దూరం గా ఉంటూ వస్తున్న నిఖిల్ మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మణికంఠ తో మాట్లాడుతున్నాడు. రీసెంట్ గా కిచెన్ లో వీళ్లిద్దరు కలిసి అంట్లు తోముకుంటున్న సమయంలో జరిగిన ఒక క్యూట్ సంభాషణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ముందుగా మణికంఠ మాట్లాడుతూ ‘సోప్ సరిగా పెట్టరా’ అని నిఖిల్ తో అంటాడు.
అప్పుడు నిఖిల్ అది నేను కడిగింది కాదురా అని అంటాడు. అప్పుడు మణికంఠ ‘నాకు నేనే చెప్పుకున్నాను లేరా’ అని అంటాడు. దానికి నిఖిల్ ‘నా కొడకా నువ్వు చేయాల్సింది చేసి నన్ను సోప్ సరిగా పెట్టరా అంటున్నావా’ అని అనగా మణికంఠ నవ్వుతాడు. వీళ్లిద్దరి మధ్య ఒకరిని ఒకరు సరదాగా తిట్టుకునేంత చనువు ఉంది, కానీ నిఖిల్ మణికంఠ పద్ధతులు నచ్చక దూరం పెట్టేసాడు. ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు మళ్ళీ కలిసిపోండి, మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి, మణికంఠతో స్నేహంగా ఉంటూ దగ్గరకు చేరదీసి ప్రతీసారి అతను వాళ్ళను వెధవల్ని చేస్తున్నాడు. కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా మణికంఠ వింత ప్రవర్తన చూసి షాక్ కి గురి అవుతున్నారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంత విచిత్రమైన కంటెస్టెంట్ బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పొచ్చు.