Mammootty: స్టార్ హీరో ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలో నటించారా? ఇంతకీ ఆ సినిమా ఏదంటే..

ద గ్రేట్ ఇండియన్ కిచెన్ డైరెక్టర్ జియో బేబీ. ఈయన దర్శకత్వంలో వస్తున్న సినిమా అనగానే ఫాలోవర్స్ లోనూ, ఫ్యాన్స్ లోనూ ఆసక్తి బాగా పెరిగింది.

Written By: Swathi, Updated On : February 28, 2024 12:52 pm
Follow us on

Mammootty: నవంబర్ 23న విడుదలై మంచి కలెక్షన్లను అందుకున్న సినిమా కాదల్ ది కోర్. ఇందులో మలయాళ సూపర్ స్టార్ ముమ్మట్టి నటించి మంచి పేరు సంపాదించారు. అయితే ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. మూడు జాతీయ అవార్డులను అందుకున్న ముమ్మట్టి కొత్తగా ఈ సారి గే పాత్రలో నటించారు. ఒక సంసార బాధ్యతలతో ఉన్న గే సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనే కాన్సెప్ట్ పై ఈ సినిమా కథ ఉంటుంది.

ఇక ఈ సినిమా గురించి తెలియగానే కాంట్రవర్సీలు ఎక్కువయ్యాయి. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది ద గ్రేట్ ఇండియన్ కిచెన్ డైరెక్టర్ జియో బేబీ. ఈయన దర్శకత్వంలో వస్తున్న సినిమా అనగానే ఫాలోవర్స్ లోనూ, ఫ్యాన్స్ లోనూ ఆసక్తి బాగా పెరిగింది. ఇక ముమ్మట్టికి జతగా జ్యోతిక అని తెలియగానే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కానీ టీజర్ రిలీజ్ తర్వాత ముమ్మట్టి క్యారెక్టర్ తెలిసి కాంట్రవర్సీలు మొదలయ్యాయి.

ఈ వయసులో ఇలాంటి పాత్రలు అవసరమా? దీని వల్ల సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటి? మర్యాద గల మనిషి తన మర్యాదను కోల్పోయేటట్టు ఇలాంటి పాత్రలు చేయడం ఏంటి అంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో పెళ్లైన తర్వాత హీరో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటాడు. అదే సమయంలో భార్య విడాకులకు అప్లై చేస్తుంది. దానికి కారణం అతను గే అని తెలియడమే.. ఇలా హీరో ఎదుర్కొనే సమస్యల గురించి సినిమా నడుస్తుంది. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయినా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కేరళలో హౌజ్ ఫుల్ తో దూసుకొనిపోతుంది.

అయితే ఈ సినిమా మీద కాంట్రవర్సీల గురించి జవాబు ఇస్తూ.. ఈ సినిమా కేవలం ఇప్పుడున్న మనుషులకు ఒక ఇన్స్పైరింగ్ మూవీ గా అనిపించాలి. అదే పరిస్థితుల్లో ఎవరు ఉన్నా వాళ్లకి ఈ మూవీ ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. అందుకే అలాంటి వాళ్ల కోసమని ఈ సినిమా తీశాము. నేను ఈ కథ చెప్పిన వెంటనే ముమ్మట్టికి ఈ సినిమా స్టోరీ అర్తమయ్యి ఈ కథను ఒప్పుకున్నారు అని జియో బేబీ చెప్పారు. ఎన్ని కాంట్రవర్సీలకు గురైన సరే ఆఖరికి సినిమా హిట్ గా నిలవడంతో మంచి కలెక్షన్లు అందుకుని హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ పాత్రలను పోషించినందుకు ముమ్మట్టి, జ్యోతికలకు కూడా మంచి పేరు వచ్చింది.