https://oktelugu.com/

Radhika Merchant: అంబానీ కి కాబోయే కోడలు గురించి ఈ విషయాలు తెలుసా?

ఇప్పటికే అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సందడి ప్రారంభమైంది. అంబానీ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టబోతున్న రాధికా మర్చంట్ ఎవరు? ఈమె ఏం చేస్తుంది. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం.

Written By: , Updated On : February 28, 2024 / 12:40 PM IST
Radhika Merchant
Follow us on

Radhika Merchant: భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జులై 12న జరుగబోతోంది. ప్రస్తుతం అందరి దృష్టి అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలపై పడింది. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లకు గత ఏడాది ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 1 నుంచి 3 మధ్యన ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి.

ఇప్పటికే అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సందడి ప్రారంభమైంది. అంబానీ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టబోతున్న రాధికా మర్చంట్ ఎవరు? ఈమె ఏం చేస్తుంది. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థం 2023లో జనవరి 19న రాధిక మర్చంట్ తో రాజస్తాన్ లో శ్రీనాథ్ జీ దేవాలయంలో కుటుంబ సభ్యుల అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. అనంత్, రాధికలకు చాలా కాలం నుంచే పరిచయం ఉందట.

ఇన్ని రోజులు మంచి ప్రెండ్స్ గా ఉన్న వీరిద్దరు, త్వరలో వివాహబంధంతో ఒకటి కాబోతున్నారు అన్నమాట. అయితే రాధిక మర్చంట్ తండ్రి పేరు వీరేన్ మర్చంట్, ఆయన కూడా పారిశ్రామిక వేత్తనే. రాధిక 1994లో డిసెంబర్ 18న శైల మర్చంట్, వీరేన్ మర్చంట్ లకు జన్మించింది. వీరేన్ మర్చంట్ ప్రముఖ ఫార్మా కంపెనీ ఎన్ కోర్ హెల్త్ కేర్ అధినేత. అంతేకాకుండా ఇండియాలోని అత్యంత ధనవంతుల్లో ఆయన కూడా ఒకరు. రాధిక ముంబైలో ఆ తర్వాత న్యూయార్క్ లో విద్యాభ్యాసం చేసింది.

న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ లో డిగ్రీ పొందింది. చదువు పూర్తైన తర్వాత ముంబైలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఇస్ర్పవ లో కొన్ని రోజులు జాబ్ చేశారు. ప్రస్తుతం ఈమె తమ సొంత సంస్థ ఎన్ కోర్ హెల్త్ కేర్ లో డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. అయితే ఈమె కూడా అత్త నీతా అంబానీ మాదిరి భరతనాట్య కళాకారిణి. ఆమె ముంబైలో గురు భావన ఠాకూర్ దగ్గర శ్రీ నిభా ఆర్ట్స్ డాన్స్ అకాడమిలో సుమారు ఎనిమిది సంవత్సరాలు శిక్షణ తీసుకున్నారు.