https://oktelugu.com/

Ketika Sharma: ఆ స్టార్ డైరెక్టర్ కొడుకు కేతిక శర్మ ని అలాంటి పనులకు వాడుకున్నాడా..?

కొంతమంది మాత్రం పెళ్లి చేసుకోకుండా మంచిగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వారి జాబితా లో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా నిలిచాడు. బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆకాష్, 'రొమాంటిక్' అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ ఆకాష్ కి మంచి పేరే వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి కేతిక శర్మ ని తీసుకున్నారు.

Written By: , Updated On : July 24, 2023 / 08:34 AM IST
Ketika Sharma

Ketika Sharma

Follow us on

Ketika Sharma: ఒకే చోట పనిచేసేటప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి మనసులు కలవడం చాలా సహజం. ముఖ్యంగా రంగుల ప్రపంచం గా పిలవబడే సినిమా ఇండస్ట్రీ లో అయితే ఇలాంటివి సర్వసాధరణం. హీరో హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు గతం లో మనం ఎన్నో చూసాము. కొంతమంది ఇప్పటి వరకు అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడిపి సంతోషం గా ఉంటుంటే, కొంతమంది పెళ్ళైన కొద్దిరోజులకే విడిపోతున్నారు.

కానీ కొంతమంది మాత్రం పెళ్లి చేసుకోకుండా మంచిగా లివింగ్ రిలేషన్ షిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వారి జాబితా లో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా నిలిచాడు. బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆకాష్, ‘రొమాంటిక్’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ ఆకాష్ కి మంచి పేరే వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి కేతిక శర్మ ని తీసుకున్నారు.

ఇందులో ఈమె ఎంత హాట్ గా కనిపించిందో మన అందరికీ తెలిసిందే, ఆకాష్ తో రెచ్చిపోయి మరీ నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో ఆకాష్ ఈమెతో ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసాడట. సినిమా షూటింగ్ మొత్తం గోవా లోనే జరిగింది. షూటింగ్ జరిగినన్ని రోజులు వీళ్ళిద్దరూ పూరి జగన్నాథ్ కి తెలియకుండా తిరుగుతూ ఉండేవారట. పార్టీలకు, పబ్బులకు ఇలా ఎక్కడ పడితే అక్కడ చెట్టాపట్టాలేసుకొని ఎంజాయ్ చేసేవారట.

వీళ్లిద్దరి వ్యవహారం అప్పట్లో బెడ్ రూమ్ వరకు వెళ్లిందని టాక్. అయితే ఈ విషయం పూరి జగన్నాథ్ కి తెలిసి ఆకాష్ పై చాలా ఫైర్ అయ్యాడట. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సినిమా ఇండస్ట్రీ నుండి తరిమేస్తా అని బెదిరించడం తో అప్పటి నుండి ఆకాష్ కాస్త సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇకపోతే కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం మరో నాలుగు రోజుల్లో మన ముందుకు రాబోతుంది.