https://oktelugu.com/

Jabardasth Varsha: ఆ సమయంలో చనిపోదాం అనుకున్నా … సంచలన నిజాలు బయటపెట్టిన జబర్దస్త్ వర్ష

తెలుగు బిగ్ బాస్ 7 మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు షురూ అయ్యాయి. ఈ క్రమంలో ఇందులోని కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా బయటకు వస్తుంది. ఈ క్రమంలో వర్ష కూడా ఈ ఏడాది బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై వర్ష మాట్లాడుతూ ' నాకు ఇప్పటికే సినిమాలో నటించే అవకాశం వచ్చింది, స్పెషల్ సాంగ్స్ కోసం కూడా ఆఫర్స్ వచ్చాయి, కానీ బుల్లితెరను విడిచి వెళ్లే ఆలోచన లేదు అందుకే వాటిని రిజెక్ట్ చేశానంటూ చెప్పుకొచ్చింది.

Written By:
  • Shiva
  • , Updated On : July 24, 2023 / 08:38 AM IST

    Jabardasth Varsha

    Follow us on

    Jabardasth Varsha: బుల్లితెర మీద అనసూయ, రష్మీ, శ్రీముఖి తర్వాత అంతటి స్టార్ డమ్ దక్కించుకున్న నటి వర్ష. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ పాపులారిటీ దక్కించుకున్న వర్ష, అనేక టెలివిజన్ షోల్లో నటిస్తూ దూసుకొని వెళ్తుంది. కామెడీతో పాటుగా అందం తో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే బిగ్ బాస్ 7 లో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    తెలుగు బిగ్ బాస్ 7 మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు షురూ అయ్యాయి. ఈ క్రమంలో ఇందులోని కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా బయటకు వస్తుంది. ఈ క్రమంలో వర్ష కూడా ఈ ఏడాది బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై వర్ష మాట్లాడుతూ ‘ నాకు ఇప్పటికే సినిమాలో నటించే అవకాశం వచ్చింది, స్పెషల్ సాంగ్స్ కోసం కూడా ఆఫర్స్ వచ్చాయి, కానీ బుల్లితెరను విడిచి వెళ్లే ఆలోచన లేదు అందుకే వాటిని రిజెక్ట్ చేశానంటూ చెప్పుకొచ్చింది.

    ఇప్పటికే సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తున్న, హీరోయిన్ గా చేయాలనే ఆలోచన అయితే లేదు, అక్క, వదిన , ఫ్రెండ్స్ లాంటి క్యారెక్టర్ మాత్రమే చేస్తాను, ఇక త్వరలోనే నేను ఒక బిగ్ షో లో కనిపించే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఇప్పటికే చెక్ లు కూడా పంపించారు. ఇక నా లైఫ్ కి సంబంధించిన కొన్ని కీలక విషయాలు అక్కడే మీతో పంచుకుంటాను అని పరోక్షంగా బిగ్ బాస్ షో గురించి హింట్ ఇచ్చింది ఈ జబర్దస్త్ చిన్నది.

    ఇదే సమయంలో తన లైఫ్ లో జరిగిన ఒక సంఘటన గురించి కీలక వ్యాఖ్యలు చేసింది వర్ష. ” నాకు నాన్న అంటే చాలా ఇష్టం, ఆయన లేని లోటు ను ఎవరు తీర్చలేరు. ఆ తర్వాత నాకు మా అన్నయ్య అంటే ప్రాణం. రెండేళ్ల క్రితం నేను సంక్రాంతికి ఊరికి వెళ్ళాను. అప్పుడు అమ్మ ఫోన్ చేసి మా చిన్న అన్నయ్యకు యాక్సిడెంట్ అయింది త్వరగా రా అని చెప్పింది. అది చిన్న యాక్సిడెంట్ ఏమో అనుకున్నాను కానీ మా అన్నయ్యను స్కూటీ తో గుద్దారు. తీరా హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత తెలిసింది, తన బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టుకుందని, బ్రతకటం కష్టమని చెప్పారు. ఎంత ఖర్చైనా సరే బ్రతికించమని డాక్టర్స్ కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాను.

    ఆ సమయంలో మా అన్నయ్య పరిస్థితి ఏమిటో నాకు మాత్రమే తెలుసు, రెండు మూడు రోజులు బయట వాష్ రూమ్ బయటే పడుకునే దానిని, ఒక సమయంలో అన్నయ్య మెదడులో రక్తం లీక్ అవుతుందని, బ్రతకటం కష్టమని చెప్పటంతో తట్టుకోలేకపోయాను, ఆ సమయంలో నేను చనిపోవాలని అనుకున్న సృహ తప్పి పడిపోవడంతో నాకు ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అన్నయ్యకు ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరి పిలుచుకున్న అంటూ ఆనాటి సంఘటనలకు గుర్తుచేసుకుంది వర్ష